AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: మహిళలకు బెస్ట్ ఛాన్స్.. ఒక్క అడుగు బయటపెట్టకుండా ఇంటి నుంచే ఆదాయం.. ఈ 5 పనులు చేస్తే చాలు..

కాలు బయట పెట్టనవసరం లేకుండా మహిళలు ఇంటి నుంచే కొన్ని వ్యాపారులు మొదలుపెట్టవచ్చు. వీటి ద్వారా స్వశక్తితో ఎదగవచ్చు. ఇంట్లోనే ఖాళీ సమయంలో ఏదైనా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని చాలామంది మహిళలు అనుకుంటుంటారు. అలాంటివారికి బెస్ట్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి.

Business Ideas: మహిళలకు బెస్ట్ ఛాన్స్.. ఒక్క అడుగు బయటపెట్టకుండా ఇంటి నుంచే ఆదాయం.. ఈ 5 పనులు చేస్తే చాలు..
Womens Business
Venkatrao Lella
|

Updated on: Oct 09, 2026 | 12:48 PM

Share

భర్తపై ఆధారపడకుండా ఆర్ధికంగా సొంతగా ఎదగాలని చాలామంది గృహిణులు భావిస్తుంటారు. భర్త, పిల్లల వంటి ఇంటి బాధ్యతలతో బయటకు వెళ్లి ఉద్యోగం చేసేంత సమయం ఉండదు. అలాంటి మహిళలు ఇంటి నుంచే ఆదాయం పొందే మార్గాల కోసం ఎదురుచూస్తుంటారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్స్ కోసం వెతుకుతుంటే.. మరికొంతమంది ఇంట్లోనే చిన్న బిజినెస్ పెట్టాలని అనుకుంటుంటారు. ఇంట్లోనే ఉండి స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు అనేక వ్యాపార మార్గాలు ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే వీటిని మొదలుపెట్టవచ్చు. అలాంటి వ్యాపారులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

క్యాటరింగ్

మహిళలకు వంటలపై మంచి అనుభవం ఉంటుంది. దీంతో ఇంట్లోనే క్యాటరింగ్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు టిఫిన్, లంచ్ బాక్సు సేవలను అందించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. దీనికి ఖర్చు కూడా పెద్దగా ఉండదు. మీ ఇంటి కిచెన్‌లోనే తయారుచేసి డెలివరీ చేయవచ్చు. ఆన్ లైన్ ఫ్లా్ట్స్‌ఫామ్స్, వాట్సప్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్లను సంపాదించుకోవచ్చు.

ఆన్ లైన్ క్లాసులు

ఇక ఎడ్యుకేషణ్ బ్యాగ్రౌండ్ ఉన్న మహిళలు పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు చెప్పడం ద్వారా ఇంటి నుంచే ఆదాయం పొందవచ్చు. ప్రస్తుం ఆన్‌లైన్‌లో అనేక ట్యూటరింగ్ వెబ్ సైట్లు, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రిజిస్టర్ చేసుకుని ఆన్ లైన్ క్లాసులు, ట్యూషన్లు చెప్పవచ్చు. దీనికి ఎలాంటి పెట్టుబడి కూడా అవసరం ఉండదు. మీరు ఇంట్లోనే సొంతగా ట్యూషన్ పాయింట్ పెట్టుకోవచ్చు.

హోమ్ బ్యూటీ సర్వీసెస్

బ్యూటీషియన్ లాంటి కోర్సులు చేసి ఉన్నా లేదా వాటిపై అనుభవం ఉన్నా ఇంట్లోనే ఒక రూమ్‌లో సెలూన్ పెట్టుకోవచ్చు. ఖర్చు సుమారు రూ.20 వేల వరకు అవుతుంది. మేకప్, హెయిర్ స్ట్రైల్, గ్రూమింగ్ సేవలు అందించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశముంది.

టైలరింగ్

ఇక టైలరింగ్ చేసుకోవడం ద్వారా ఇంటి నుంచే మహిళలు ఆదాయం పొందవచ్చు. మీ సమీపంలోని వినియోగదారులకు కస్టమ్ స్టిచింగ్, వస్త్ర మార్పులు, ఎత్నిక్ వేర్ వంటి సేవలు అందించడం ద్వారా ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే డబ్బుల సంపాదించవచ్చు. ప్రభుత్వాలు, కొన్ని స్వచ్చంధ సంస్థలు ఉచితంగా మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇస్తున్నాయి. ఇక్కడ మీరు నేర్చుకుని ఆ తర్వాత ఇంట్లోనే పెట్టుకోవచ్చు.

చిరుతిళ్ల వ్యాపారం

ఇంట్లోనే చిరుతిళ్లు లాంటివి తయారుచేసి ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా విక్రయించవచ్చు. స్నాక్స్ ఐటమ్స్ లాంటివి తయారుచేసి అమ్మడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. దీనికి ప్రారంభ ఖర్చు రూ.10 వేల వరకు అవుతుంది. కస్టమర్లు పెరిగే కొద్ది మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. వాట్సప్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్లను సంపాదించుకోవచ్చు.

Follow Us