AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాయ్ తాగితే తలనొప్పి తగ్గుతుందా..? అసలు నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

తలనొప్పి రాగానే చాలామంది మందుల కంటే వేడివేడిగా ఒక కప్పు టీ తాగడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. టీ తాగిన వెంటనే నొప్పి మాయమై ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అయితే టీ తాగడం వల్ల నిజంగానే తలనొప్పి తగ్గుతుందా? లేక ఇది కేవలం తాత్కాలిక భ్రమేనా? ఈ అలవాటు వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ప్రముఖ పోషకాహార నిపుణులు వెల్లడించిన అసలు నిజాలివే..

Krishna S
|

Updated on: Oct 09, 2026 | 4:45 PM

Share
టీ తాగినప్పుడు తలనొప్పి తగ్గిన అనుభూతి కలగడానికి అందులోని సహజసిద్ధమైన కెఫీన్ ప్రధాన కారణమని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన డైటీషియన్ రంజనా సింగ్ స్పష్టం చేస్తున్నారు. మైగ్రేన్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తినప్పుడు మెదడులోని రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల నొప్పి తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో శరీరంలోకి కొద్ది మోతాదులో కెఫీన్ చేరగానే, అది రక్తనాళాలను సంకోచింపజేసి తలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ కారణంగానే మార్కెట్లో లభించే పలు రకాల పెయిన్ కిల్లర్ మందులలో కూడా తక్కువ మోతాదులో కెఫీన్‌ను ఒక పదార్థంగా వినియోగిస్తుంటారు.

1 / 5
అయితే అన్ని రకాల తలనొప్పులకు కేవలం టీ మాత్రమే పూర్తి పరిష్కారం కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి రావడానికి గల కారణం తీవ్రమైన మానసిక ఒత్తిడి, శరీరంలో నీటిశాతం తగ్గడం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు అయినప్పుడు.. ఎన్ని కప్పుల టీ తాగినా శాశ్వత ఉపశమనం లభించదు. కేవలం రక్తనాళాల సమస్యతో ముడిపడిన తలనొప్పులకు మాత్రమే కెఫీన్ తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుంది తప్ప, అంతర్లీన సమస్యను ఇది పూర్తిగా నయం చేయలేదు.

2 / 5
చాలామంది తలనొప్పి వస్తోందన్న కారణంతో ఖాళీ కడుపుతో పదే పదే టీ తాగుతుంటారు. కానీ ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఖాళీ కడుపుతో అధికంగా టీ సేవించడం వల్ల జీర్ణాశయంలో ఎసిడిటీ పెరిగి, తలనొప్పి మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. మరోవైపు రోజూ అధికంగా టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి తెలియకుండానే కెఫీన్‌పై ఆధారపడే తత్వం ఏర్పడుతుంది. అలాంటి వారు అనుకోకుండా టీ తాగడం మానేసినా లేదా సమయం దాటినా కెఫీన్ విత్‌డ్రాయల్ ప్రభావంతో తీవ్రమైన తలనొప్పి వస్తుంది.

3 / 5
సాధారణ పాల టీ కంటే అల్లం టీ లేదా మూలికలతో కూడిన హెర్బల్ టీలు తాగడం వల్ల కొంత మెరుగైన ప్రయోజనం లభిస్తుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును, మైగ్రేన్ సమయంలో వచ్చే వికారాన్ని అదుపు చేయడంలో తోడ్పడతాయి. అయితే ఇది కూడా నొప్పిని తాత్కాలికంగా తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, శాశ్వత నివారణ కాదని గుర్తించాలి.

4 / 5
తరచుగా తలనొప్పితో బాధపడేవారు కేవలం టీ తాగడంపైనే ఆధారపడి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పితో పాటు తీవ్రమైన వికారం, వాంతులు, కళ్లు తిరగడం, కంటిచూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. సమస్య మూల కారణాన్ని గుర్తించి వైద్యం తీసుకున్నప్పుడే తలనొప్పి నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

5 / 5
Follow Us