నెయ్యి తింటే గుండెకు మంచిదా? చెడు చేస్తుందా?

09 October 2026

TV9 Telugu

TV9 Telugu

వేడివేడి అన్నంలో నెయ్యి (Ghee).. పప్పులో నెయ్యి.. రోటీ (Roti) పై నెయ్యి.. ఇలా మ‌న దేశంలో నెయ్యికి ఉన్న ప్రత్యేకతే వేరు

TV9 Telugu

పెద్దలు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. ప‌సిపిల్ల‌ల‌కు నెయ్యి పెడితే బలమంటారు. రుచికి కూడా తిరుగుండదు

TV9 Telugu

అయితే నెయ్యి అతిగా తింటే గుండె ఆరోగ్యం (Heart Health) పై ప్రభావం పడుతుందా..? నెయ్యి గుండెకు మేలు చేస్తుందా చెడు చేస్తుందా..?

TV9 Telugu

నెయ్యిలో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల నెయ్యిలో దాదాపు 883 కిలోకేలరీలు ఉంటాయి

TV9 Telugu

కాబ‌ట్టి నెయ్యిని మితంగా తీసుకుంటే స‌మ‌స్య లేదు. అతిగా తీసుకుంటేనే కొవ్వు పేరుకుంటుంది

TV9 Telugu

శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా తీసుకోవడంవల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగే అవకాశం ఉంది

TV9 Telugu

కొలెస్ట్రాల్‌ ఎక్కువ కాలం అధికంగా ఉంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది

TV9 Telugu

కాబ‌ట్టి రోజూ నెయ్యి తినే అల‌వాటు మంచిదే అయినా.. మోతాదుకు మించ‌కుండా చూసుకోవ‌డం ఉత్తమ‌మ‌ని నిపుణులు అంటున్నారు