AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. పొలం పనులకు వెళ్తూ ఇద్దరు వ్యవసాయ కూలీల దుర్మరణం..!

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ పాలెం సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని పొలం పనులకు వెళ్తున్న దావులూరు పాలెంకు చెందిన దంపతులు అద్దంకి రాజారావు, ఏమినేని రాగమ్మ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. పొలం పనులకు వెళ్తూ ఇద్దరు వ్యవసాయ కూలీల దుర్మరణం..!
Road Accident
Balaraju Goud
|

Updated on: Oct 09, 2026 | 3:57 PM

Share

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమాన్ పాలెం గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఒక ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దావులూరు పాలెం గ్రామానికి చెందిన అద్దంకి రాజారావు, ఏమినేని రాగమ్మ ఇద్దరూ కలిసి రోజూవారీ వ్యవసాయ పనుల కోసం టీవీఎస్ వాహనంపై పొలానికి బయలుదేరారు. వీరు హనుమాన్ పాలెం సమీపానికి చేరుకోగానే, ఎదురుగా అతివేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ వీరి ద్విచక్రవాహనాన్ని తీవ్రంగా ఢీకొట్టింది. ట్రాక్టర్ ఢీకొట్టిన తీవ్రతకు ద్విచక్రవాహనంపై ఉన్న అద్దంకి రాజారావు, ఏమినేని రాగమ్మ తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన సమీప రైతులు, వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కొల్లిపర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వ్యవసాయ పనులకు వెళ్తూ మార్గమధ్యంలోనే దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక దావులూరు పాలెం, హనుమాన్ పాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us