Andhra: వర్షంలోనూ కొనసాగిన చేబ్రోలు టీడీపీ అభ్యర్థి మేదరమెట్ల కృష్ణయ్య ప్రచారం
చేబ్రోలు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మేదరమెట్ల కృష్ణయ్య వేజెండ్ల, సుద్దపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆశీస్సులతో ఆయన అందర్నీ కలుపుకుంటూ ముందకు సాగుతున్నారు. వర్షం కురుస్తున్నా గ్రామాల్లో పర్యటన కొనసాగింది. పూర్తి వివరాలు కథనంలో తెలుసుకుందాం ..

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా చేబ్రోలు జడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మేదరమెట్ల కృష్ణయ్య గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల వేజెండ్ల, సుద్దపల్లి గ్రామాల్లో పర్యటించి స్థానికులను కలిశారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆశీస్సులతో కృష్ణయ్య.. కూటమి నాయకులు అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు.
View this post on Instagram
గ్రామాల్లో పర్యటించిన సమయంలో కృష్ణయ్య స్థానికులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక పరిస్థితులు, ప్రజల అవసరాలపై చర్చించారు. గ్రామస్థులతో నేరుగా మాట్లాడేలా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. తనను జడ్పీటీసీగా గెలిస్తే చేబ్రోలు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో స్థానిక కూటమి నాయకులు, ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
View this post on Instagram
వేజెండ్లలో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొని కృష్ణయ్యకు మద్దతుగా ఓటర్లను కలిశారు. మరోవైపు సుద్దపల్లిలోనూ అభ్యర్థి పర్యటన కొనసాగింది. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంగుటున్నారు..
ఇదిలా ఉండగా, వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచార కార్యక్రమాలు కొనసాగడం విశేషం. వాతావరణ పరిస్థితుల మధ్య కూడా గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసే కార్యక్రమాన్ని కృష్ణయ్య చేపట్టారు. ఈ పర్యటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
View this post on Instagram
