AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో నటించిన చిన్నారి గుర్తుందా? ఇప్పుడు హీరోయిన్‌గా బిజీ.. ప్రభాస్ స్పిరిట్‌లోనూ ఛాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్స్ లో బద్రి ఒకటి. డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో విడుదలైన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో నటించిన చిన్నారి గుర్తుందా? ఇప్పుడు హీరోయిన్‌గా బిజీ.. ప్రభాస్ స్పిరిట్‌లోనూ ఛాన్స్!
Badri Movie
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2026 | 10:53 AM

Share

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు విడుదలై ఏళ్లు గడుస్తున్నా ప్రేక్షకుల మనసుల్లో మాత్రం చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు, ఆయన మేనరిజమ్స్ ఇప్పటికీ అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమాలోని ఓ చిన్న సన్నివేశం కూడా ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. పార్క్‌లో దిగులుగా కూర్చున్న పవన్ కళ్యాణ్ దగ్గరకు ఓ చిన్నారి వచ్చి ఎందుకు బాధగా ఉన్నారని అడుగుతుంది. తనకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని పవన్ చెప్పగా.. తనకు కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ ఆ చిన్నారి ఇచ్చే సమాధానం అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

బద్రి సినిమాలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, చక్కటి టైమింగ్‌తో ఆకట్టుకున్న ఆ చిన్నారి ప్రముఖ నటుడు, కమెడియన్ ఉత్తేజ్ కుమార్తె చేతన. బాలనటిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, చిన్న వయసులోనే పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. శ్రీకాంత్ నటించిన గిల్లి కజ్జాలు సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రతో వెండితెరకు పరిచయమైన చేతన.. ఆ తర్వాత బద్రి, చిత్రం, భద్రాచలం, పౌర్ణమి వంటి చిత్రాల్లో బాలనటిగా మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చేతన ఉత్తేజ్.. 2017లో విడుదలైన పిచ్చిగా నచ్చావ్ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత ప్యార్ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించారు. అయితే హీరోయిన్‌గా ఆమె చేసిన ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చేతన ఉత్తేజ్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరోయిన్‌గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీ దృశ్యంలో పెద్ద కుమార్తె పాత్ర చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రలో నటించలేకపోయానని, కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఆ మంచి అవకాశాన్ని వదులుకోవడం ఇప్పటికీ బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా చేతన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘పౌర్ణమి’ సినిమా షూటింగ్ సమయంలో తనకు 13 ఏళ్ల వయసు ఉండేదని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రభాస్ తనను సరదాగా ఆటపట్టిస్తూ ఉండేవారని తెలిపారు. ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగినప్పటికీ, ఎప్పుడు కలిసినా గతంలో ఎలా ఆప్యాయంగా పలకరించేవారో ఇప్పటికీ అలాగే పలకరిస్తారని చెప్పారు. ప్రభాస్‌లోని ఈ మంచి గుణం తనకు ఎంతో నచ్చుతుందని పేర్కొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో చేతన వెల్లడించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్‌’లో తాను నటిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఒకప్పుడు ‘బద్రి’ సినిమాలో చిన్నారిగా పవన్ కళ్యాణ్‌తో కలిసి సందడి చేసిన చేతన.. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కనిపించబోతుండటం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us