AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: అభిషేక్ శర్మ @ 53.. స్కై ఆల్ టైం రికార్డ్‌ బద్దలే.. అదేంటంటే?

India vs West Indies: వెస్టిండీస్‌తో రెండో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు మరో అరుదైన రికార్డు అందుబాటులోకి వచ్చింది. కేవలం 53 పరుగులు చేస్తే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేయడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ప్రత్యేక ప్రపంచ రికార్డును కూడా అధిగమించే అవకాశం అతడికి ఉంది.

Venkata Chari
|

Updated on: Oct 09, 2026 | 4:03 PM

Share
Abhishek Sharma Records: భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరో భారీ మైలురాయికి చేరువయ్యాడు. వెస్టిండీస్ (West Indies)తో రాంచీలో జరిగే రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో అతడు 53 పరుగులు సాధిస్తే టీ20ఐల్లో 2000 పరుగుల మార్క్‌ను అందుకుంటాడు. అంతేకాదు.. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేరిట ఉన్న కీలక ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.

1 / 5
సూర్య రికార్డుపై అభిషేక్ కన్ను..: టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ రికార్డు కొనసాగుతోంది. సూర్య ఈ ఘనతను 1164 బంతుల్లో సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) 1283 బంతుల్లో 2000 టీ20ఐ పరుగులు పూర్తి చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

2 / 5
అభిషేక్ ఇప్పటికే ఈ రికార్డును బద్దలు కొట్టే స్థితిలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు టీ20ఐల్లో 997 బంతులు ఎదుర్కొని 1947 పరుగులు చేశాడు. మరో 53 పరుగులు సాధిస్తే 2000 పరుగుల క్లబ్‌లోకి ప్రవేశిస్తాడు. అభిషేక్ తన 2000 పరుగులను 1164 బంతుల్లోపు పూర్తి చేస్తే సూర్యకుమార్ రికార్డును అధిగమిస్తాడు. అంటే అతడికి మరో 167 బంతుల వరకు అవకాశం ఉంది. అతడి ప్రస్తుత బ్యాటింగ్ విధానం చూస్తే ఈ రికార్డు అందుకోవడానికి తగినంత సమయం ఉంది.

3 / 5
195కు పైగా స్ట్రైక్‌రేట్..: అభిషేక్ శర్మ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అత్యంత వేగంగా పరుగులు సాధిస్తున్న భారత బ్యాటర్లలో ఒకడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 195.29గా ఉంది. ఇప్పటివరకు 135 సిక్సర్లు బాదిన అతడు మూడు టీ20ఐ సెంచరీలు కూడా సాధించాడు. ఇటీవల అఫ్గానిస్థాన్ (Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ మరో సంచలనం సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే టీ20 అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసి భారత బ్యాటర్‌గా ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

4 / 5
రాంచీలో రెండో టీ20..: భారత్ (India), వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో (JSCA International Stadium) జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సెంచరీ ఆధారంగా ఘన విజయం సాధించింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు అభిషేక్ శర్మకు మాత్రం ఈ మ్యాచ్ వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం కానుంది. 53 పరుగులు చేస్తే 2000 టీ20ఐ పరుగుల మైలురాయిని అందుకోవడంతో పాటు సూర్యకుమార్ రికార్డును కూడా తన పేరిట రాసుకునే అవకాశం అతడి ముందుంది.

5 / 5
Follow Us