AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ సిరీస్‌కు ముందే షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్.. ఎందుకంటే?

India vs New Zealand: భారత్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో అసలు జట్టును ప్రకటించిన కొద్ది రోజులకే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు టీమ్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది.

IND vs NZ సిరీస్‌కు ముందే షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్.. ఎందుకంటే?
India Vs New Zealand
Venkata Chari
|

Updated on: Oct 09, 2026 | 4:50 PM

Share

India vs New Zealand: భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) మధ్య టీ20 సిరీస్‌కు ఇంకా దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ కివీస్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఆటగాళ్లు గాయపడటంతో వారు మొత్తం సిరీస్‌కు అందుబాటులో ఉండరని న్యూజిలాండ్ క్రికెట్ (New Zealand Cricket) వెల్లడించింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ (Mark Chapman), పేసర్ జాకరీ ఫోక్స్ (Zakary Foulkes) గాయాల కారణంగా భారత పర్యటనకు దూరమయ్యారు. అక్టోబర్ 9న న్యూజిలాండ్ క్రికెట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

చాప్‌మన్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం..

ఎడమచేతి బ్యాటర్ మార్క్ చాప్‌మన్‌కు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో ఆడుతున్న సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయింది. ఈ గాయం నుంచి సకాలంలో కోలుకునే అవకాశం లేకపోవడంతో భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. అయితే చాప్‌మన్ విషయంలో న్యూజిలాండ్‌కు కొంత ఆశ ఉంది. నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ సమయానికి అతడు పూర్తిగా ఫిట్‌గా మారే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది.

ఎక్కువమంది చదివినది: ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!

ఇవి కూడా చదవండి

ఫోక్స్‌కు హిప్ గాయం..

మరోవైపు ఫాస్ట్ బౌలర్ జాకరీ ఫోక్స్‌కు న్యూజిలాండ్ దేశవాళీ టోర్నమెంట్‌లో ఆడుతున్న సమయంలో హిప్ ప్రాంతంలో గాయం అయింది. దీంతో భారత్‌తో టీ20 సిరీస్‌కు అతడు కూడా దూరమయ్యాడు. అయితే ఫోక్స్ తిరిగి ఎప్పుడు మైదానంలోకి వస్తాడనే విషయంపై న్యూజిలాండ్ క్రికెట్ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన గడువు ప్రకటించలేదు. దీంతో అతడి పునరాగమనానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

సిరీస్‌కు ముందే ఇరు జట్లకు గాయాల సమస్య..

అక్టోబర్ 22 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌కు ముందే ఇరు జట్లు ఆటగాళ్ల గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఇద్దరు కివీస్ ఆటగాళ్లు దూరం కావడంతో న్యూజిలాండ్ తమ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.

ఎక్కువమంది చదివినది: నెట్స్‌లో బుడ్డోడి ఊచకోత.. తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..?

చాప్‌మన్ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడా? ఫోక్స్ ఎప్పటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడు? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us