జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్‌ ప్లాన్‌ ఉందని మీకు తెలుసా? 

October 07, 2026

Subhash

జియో మరో ఆసక్తికరమైన రీఛార్జ్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. రూ.450తో రీఛార్జ్ చేస్తే 36 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 

/జియో రీఛార్జ్ ఆప్షన్‌

సాధారణంగా 28 రోజుల ప్లాన్‌లతో పోలిస్తే అదనంగా 8 రోజుల వ్యాలిడిటీ రావడం ఈ ప్లాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.

 వ్యాలిడిటీ

రోజువారీ డేటా లిమిట్‌ పూర్తయిన తర్వాత వేగం తగ్గుతుంది. 5G స్మార్ట్‌ఫోన్ ఉన్న జియో వినియోగదారులకు ఈ ప్లాన్ మరింత ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. 

రోజువారీ డేటా

మీ ప్రాంతంలో Jio True 5G సేవ అందుబాటులో ఉండి, మీరు అర్హత కలిగిన ప్లాన్/డివైజ్ ఉపయోగిస్తే Unlimited 5G డేటా ప్రయోజనం పొందవచ్చని జియో వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. 

మీ ప్రాంతంలో

ఈ ప్లాన్‌లో కాల్స్, SMS కూడా అందుబాటులో ఉంటాయి. డేటాతో పాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, అలాగే ప్రతిరోజూ 100 SMS కూడా ఉచితంగా లభిస్తాయి.

ఈ ప్లాన్‌లో 

ఈ ప్లాన్‌లో JioHotstar వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. Jio అధికారిక ప్లాన్ లిస్టింగ్‌లో ఈ ప్యాక్‌ను 5G + AI + JioHotstar కేటగిరీలో చూపిస్తోంది.

OTT ప్రయోజనాలు కూడా

రోజూ డేటా ఎక్కువగా ఉపయోగించే వారు, OTT కంటెంట్ చూసేవారు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా 28 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వారికి 36 రోజుల ప్లాన్ ఉపయోగకరంగా ఉండొచ్చు.

రోజూ డేటా

ఈ ప్లాన్‌ తీసుకునే వారు రీఛార్జ్ చేసే ముందు MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్‌లో మీ నంబర్‌కు రూ.450 ప్లాన్ ఉందో లేదో చెక్‌ చేసుకోండి.

ప్లాన్‌