AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: భారత్‌కు అమెరికా నుంచి బిగ్ రిలీఫ్.. సుంకాలు తగ్గింపు.. త్వరలో అమల్లోకి కీలక బిల్లు..

భారత్‌కు అమెరికా బిగ్ రిలీఫ్ అందించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకునే దేశాలపై విధిస్తున్న 500 శాతం పన్నును సడలించింది. కేవలం 100 శాతం మాత్రమే పన్ను విధించేలా మార్పులు చేసింది. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే థర్డ్ పార్టీ కొనుగోలుదారులపై సుంకాల భారాన్ని తగ్గిస్తుంది.

India: భారత్‌కు అమెరికా నుంచి బిగ్ రిలీఫ్.. సుంకాలు తగ్గింపు.. త్వరలో అమల్లోకి కీలక బిల్లు..
India
Venkatrao Lella
|

Updated on: Jul 15, 2026 | 8:53 AM

Share

భారత్‌కు విధించిన సుంకాలను సడలిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అమెరికా చట్టసభ సభ్యులు రష్యా ఆంక్షల బిల్లు ప్రవేశపెట్టారు. దివంగత రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ మొదట ప్రవేశపెట్టిన ఈ బిల్లు.. భారత్, చైనాతో పాటు రష్యా నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలపై విధించిన 500 శాతం సుంకం ప్రతిపాదనను సడలిస్తుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చే కేవలం 100 శాతం వరకు మాత్రమే సుంకాలు విధించే అధికారం ఉంటుంది. ఈ బిల్లు రష్యాపై ఆంక్షలు విధించడంతో పాటు ఇంధనానికి సంబంధించి రష్యాపై చైనా, భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించేలా చేస్తుంది. ఈ నిర్ణయం రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయని అమెరికా చట్టసభ సభ్యులు భావిస్తున్నారు.

రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే దేశాల్లో చైనా, భారత్, స్లోవేకియా, హంగేరి, అజర్‌బైజాన్ ముందు వరుసలో ఉన్నాయి. రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగేరి బెల్జియం టాప్‌లో ఉన్నాయి. ఈ కొత్త బిల్లు రష్యా చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే థర్డ్ పార్టీ కొనుగోలుదారులపై విధించే సుంకాలను తగ్గిస్తుంది. 500 శాతం నుండి గరిష్టంగా 100 శాతానికి తగ్గిస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఇక రష్యా సహజ వాయువు ఎగుమతులలో 15 శాతం కంటే తక్కువ దిగుమతి చేసుకుంటూ, ఆ దిగుమతులను తగ్గించడానికి గణనీయమైన చర్యలు తీసుకుంటున్న దేశాలకు కూడా మినహాయింపు లభించనుంది. దీనివల్ల జపాన్, ఫ్రాన్స్, హంగరీ, బెల్జియంలకు కూడా బగ్ రిలీఫ్ దక్కుతుంది. ఇక అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షలను ఎత్తివేయడానికి వీలు కల్పించే నిబంధనను కూడా ఈ బిల్లులో చేర్చారు

గత వారం మరణించిన సెనేటర్ గ్రాహం.. కేవలం ఒక రోజు ముందు తన ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా రష్యా ఆంక్షల బిల్లును ప్రవేశపెట్టారు. ఏడాదికి పైగా గడిచిన తర్వాత దానిని ముందుకు తీసుకెళ్లేందుకు రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించారు. ఈ బిల్లుకు 26 మంది సహప్రాయోజకులు ఉన్నారని, మరికొన్ని గంటల్లో మరికొంతమంది చేరతారని తాము ఆశిస్తున్నామని సెనేట్ సహాయకులు తెలిపారు. బిల్లు ఆమోదం పొందే అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2025లో సౌత్ కరోలినాకు చెందిన రిపబ్లికన్ అయిన గ్రాహం, కనెక్టికట్ డెమోక్రాట్ అయిన బ్లూమెంతల్ ప్రవేశపెట్టిన అసలు వెర్షన్ నుండి ఈ బిల్లు మార్చారు.

Follow Us