AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మళ్లీ వాయిదా పడిన ఆ సిరీస్.. బీసీసీఐ ఆగ్రహానికి కారణమిదే..!

India vs Bangladesh Series: క్రికెట్ అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించే వార్త. మైదానంలో ఎంతో ఆసక్తిగా సాగే దాయాదుల పోరును చూద్దామనుకున్న సగటు క్రీడాభిమానికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్ మరోసారి వాయిదా పడింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే ఈ తాజా పరిణామానికి ప్రధాన కారణం.

Venkata Chari
|

Updated on: Jul 15, 2026 | 12:42 PM

Share
గతకొంత కాలంగా భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ విభేదాల కారణంగా ఇరు జట్ల మధ్య క్రికెట్ సిరీస్ గత ఏడాదిన్నర కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులోనే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. కానీ 2026 టీ20 ప్రపంచకప్ సన్నాహకాల నేపథ్యంలో టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా దీనిని వాయిదా వేశారు. ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పాలకమండలి మారడంతో, సిరీస్ నిర్వహణపై ఇరు బోర్డుల మధ్య మళ్లీ చర్చలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య విండీస్ సిరీస్ కు ముందు ఖాళీగా ఉన్న సమయంలో ఈ సిరీస్ జరుగుతుందని బంగ్లా బోర్డు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి.

1 / 5
అయితే, అనూహ్యంగా ఈ సిరీస్ మళ్లీ అటకెక్కింది. దీనికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరే అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత్‌తో జరగాల్సిన సిరీస్‌తో సహా తమ దేశంలో జరిగే మ్యాచ్‌ల ప్రసార హక్కుల అమ్మకానికి సంబంధించి బంగ్లా బోర్డు టెండర్లను ఆహ్వానించింది. కానీ, ఈ ప్రక్రియకు సంబంధించిన కీలకమైన పత్రాలను బీసీసీఐకి సమర్పించకుండానే విక్రయాలకు నోటిఫికేషన్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. బంగ్లా బోర్డు వ్యవహరించిన ఈ తీరుపై భారత బోర్డుతో పాటు బ్రాడ్‌కాస్టర్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2 / 5
ఈ వివాదంపై బంగ్లా బోర్డు వర్గాలు స్పందిస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాయి. తమ ప్రణాళికల్లో చిన్న మార్పు రావడం వల్లే పత్రాలు ఇవ్వలేదని, మార్కెట్ పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే బిడ్‌లను ఆహ్వానిస్తామని వివరణ ఇచ్చాయి. కేవలం భారత్ సిరీస్ కోసమే తాము పత్రాలను నిలిపివేశామనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి.

3 / 5
ఇటీవల స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో బంగ్లా బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ భారత ప్రతినిధులతో సానుకూలంగా చర్చలు జరిపారు. సిరీస్ నిర్వహణపై బీసీసీఐ ఇంకా అనుమతి ఇవ్వనప్పటికీ, రాబోమని మాత్రం ఖచ్చితంగా చెప్పలేదని బంగ్లా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు.. ఆ తర్వాత ఆగస్టులో ఆస్ట్రేలియాతో చారిత్రక టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత నవంబర్-డిసెంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.

4 / 5
ఏది ఏమైనప్పటికీ, రెండు దేశాల బోర్డుల మధ్య సమన్వయ లోపం కారణంగా క్రికెట్ అభిమానులు ఒక అద్భుతమైన సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తోంది. మైదానంలో భారత్-బంగ్లాదేశ్ ఆటగాళ్లు తలపడితే ఆ కిక్కే వేరు. ఈ చిన్నపాటి వివాదం త్వరగా సమసిపోయి, ఇరు బోర్డులు ఒక సానుకూల నిర్ణయానికి రావాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. బీసీసీఐ తీసుకునే తుది నిర్ణయంపైనే ఈ సిరీస్ భవితవ్యం ఆధారపడి ఉంది.

5 / 5
Follow Us
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..

32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా

రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి

'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'

అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే

దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ

టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం

గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..

విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN