Astrology: గురు, రవి కటాక్షం..ఈ రాశుల వారు నాయకులుగా ఎదుగుతారు..!
Leadership Astrology: అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండటం, అక్టోబర్ 16 వరకు రవి అనుకూల రాశుల్లో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అసాధారణ నాయకత్వ అవకాశాలు కలగనున్నాయి. ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల వారు రాజకీయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తి, సంస్థలు, యూనియన్లలో నాయకులుగా ఎదిగి గుర్తింపు పొందే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

అక్టోబర్ 31 వరకు గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, అక్టోబర్ 16 వరకు రవి కర్కాటక, సింహ, కన్యా రాశుల్లోనూ సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి సహజంగానే నాయకత్వ లక్షణాలున్నాయి. గ్రహాల అనుకూలత వల్ల వీరు నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంది. మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారు తమ తమ రంగాల్లో ఉచ్ఛ స్థితికి వెళ్లి సంస్థలను నిర్వహించడం జరుగుతుంది. రాజకీయాలు, ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారాలు, యూనియన్లలో నాయకులుగా దూసుకుపోవడం జరుగుతుంది.
- మేషం: అందరినీ కలుపుకునిపోయే తత్వం, నాయకత్వ లక్షణాలు, హుందాగా వ్యవహరించే ఈ రాశి వారికి జూలై తర్వాత నుంచి అక్టోబర్ నెలాఖరు లోపు ఉన్నత పదవులు నిర్వహించే అవకాశం ఉంది. గురువు నాలుగవ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఉన్నత పదవులను చేపట్టి సంస్థను నిర్వహించే అవకాశం ఉంది. గురువు ఉచ్ఛ స్థితితో వీరికి హంస మహా పురుష యోగం కలుగుతున్నందు వల్ల వీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నతోద్యోగాలను చేపట్టడం జరుగుతుంది.
- కర్కాటకం: సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు అందరిపట్లా ఆదరభావంతో వ్యవహరించే ఈ రాశివారు అక్టోబర్ నెలాఖరులోపు ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల వీరికి హంస మహా పురుష యోగం కలిగి రాజకీయంగా కూడా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా సారథ్య బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.
- సింహం: నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం, అందరినీ కలుపుకునిపోవడం, అధికారం చెలాయించాలనే ఆరాటం ఎక్కువగా ఉండే ఈ రాశివారు గ్రహ బలం వల్ల త్వరలో ఉన్నత పదవులను అందుకునే అవకాశం ఉంది. జూలై- అక్టోబర్ నెలల మధ్య ఈ రాశివారు ఏదైనా సంస్థకు అధిపతి అయ్యే అవ కాశం ఉంది. రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలగడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఏ రంగంలో ఉన్నా వీరు అధికారం చేపట్టడం జరుగుతుంది.
- తుల: ఈ రాశికి దశమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలోనూ, లాభాధిపతి రవి దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు వ్యాపార రంగంలో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో అగ్రస్థానంలో ఉండడానికి తపించి పోయే ఈ రాశివారికి ఆ ఆశయం సిద్ధించే అవకాశం ఉంది. గురువు వల్ల హంస మహా పురుష యోగం పట్టడంతో వీరు రాజకీయాల్లో కూడా దూసుకుపోవడం, అత్యంత సంపన్నులు కావడం జరుగుతుంది. వీరికి అధికార యోగం పడుతుంది.
- వృశ్చికం: ఏ రంగంలో ఉన్నా అగ్ర స్థానంలో ఉండడానికి తాపత్రయపడే ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు అనుగ్రహం వల్ల రాజకీయాల్లో గానీ, ప్రభుత్వంలో గానీ అగ్రస్థానానికి చేరు కునే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడు కావడం, సాధారణ ఉద్యోగి సైతం ఉన్న తోద్యోగి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక సంస్థకు అధిపతి కావడం జరుగుతుంది. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. రాజకీయ ప్రాబల్యం కలిగే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి కుజ, రవి గ్రహాలు, రాహువు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఆగస్టు నుంచి ఈ రాశివారి దశ తిరిగే అవకాశం ఉంది. వీరిలోని నాయకత్వ లక్షణాలకు తగ్గట్టుగా వీరికి ఏదైనా సంస్థలో ఉన్నతోద్యోగం లభించడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజ యాలు సాధించడం ద్వారా కూడా వీరు ఉన్నతోద్యోగాలను పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో బాగా రాణించి, అధికారం చేపడతారు. ఎక్కడ ఉన్నా హోదాలు, పదవులు వీరిని వరిస్తాయి.
Disclaimer : ఈ కథనం జ్యోతిష్య శాస్త్రంలోని సంప్రదాయ విశ్వాసాలు, గ్రహ సంచారాల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో పేర్కొన్న ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు, ఇతర జ్యోతిష్య అంశాలపై ఆధారపడి మారవచ్చు. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా కాకుండా సాధారణ జ్యోతిష్య విశ్లేషణగా మాత్రమే పరిగణించాలి.



