మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..!
Gajakesari Rajyoga 2026: జూలై 14న (మంగళవారం) కర్కాటక రాశిలో చంద్రుడు-గురుడి కలయికతో అత్యంత శుభప్రదమైన 'గజకేసరి రాజయోగం' ఏర్పడనుంది. దాదాపు మూడు రోజుల పాటు ప్రభావం చూపనున్న ఈ అరుదైన యోగం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టంపట్టనుంది. దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి ధనలాభం, కెరీర్‌లో భారీ పురోగతి, కీర్తి, గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశముంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం ప్రభావంతో అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 14న (మంగళవారం) అత్యంత పవిత్రమైన ‘గజకేసరి రాజయోగం’ ఏర్పడనుంది. ప్రస్తుతం గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తుండగా.. మంగళవారంనాడు చంద్రుడు కూడా తన స్వరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశిలో చంద్రుడు-గురుడి కలయిక ఏర్పడి గజకేసరి రాజయోగం సుమారు మూడు రోజుల పాటు ప్రభావం చూపనుంది. జ్యోతిష్యశాస్త్రంలో గజకేసరి యోగం సంపద, కీర్తి, ఆర్థికాభివృద్ధి, కెరీర్‌లో పురోగతి, ఆత్మవిశ్వాసం, గౌరవ ప్రతిష్ఠలను ప్రసాదించే శుభయోగంగా భావిస్తారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ యోగం విశేష ఫలితాలను ఇవ్వనుంది.
మేష రాశి
మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. కెరీర్‌లో చాలా కాలంగా ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి.
కర్కాటక రాశి
ఈ యోగం కర్కాటక రాశిలోనే ఏర్పడుతున్నందున వీరికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశముంది. వ్యాపారంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక స్థిరత్వం, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సంతోషం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అవివాహితులకు వివాహ యోగం కూడా బలపడుతుంది. పిల్లలు చదువులు, కెరీర్‌లో రాణిస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారికి కెరీర్‌లో ఊహించని స్థాయిలో మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కార్యాలయంలో గుర్తింపు, ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరగడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మరింత బలపడే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, గురువుల అండదండలతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఓ గొప్ప అవకాశం మీ తలుపుతడుతుంది.
ధనుస్సు రాశి
గజకేసరి రాజయోగం సరికొత్త ఆర్థిక లాభాలను, అదృష్టాన్ని తీసుకువస్తుంది. కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కెరీర్‌లో పెద్ద విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పెద్ద బాధ్యతలు, వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూల సమయంగా భావిస్తున్నారు. మీ పోటీదారులపై పైచేయి సాధిస్తారు.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు జ్యోతిష్య విశ్వాసాలు, అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే పరిగణించాలి)




