AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆ వెంటనే..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్యాస్ పైపు లీక్ కారణంగా వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆ వెంటనే..
Gas Leak
Naresh Gollana
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 12:28 PM

Share

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్‌ పెట్రోల్ పంపు పాఠశాలలోని వంటగదిలో ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.. చూస్తుండగానే.. భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి మద్యాహ్నం భోజనం పథకం అమలవుతుండటంతో వంట సిబ్బంది ఉదయం 9 గంటలకే వంట పని మొదలు పెట్టారు‌. విద్యార్థులంతా అప్పటికే పాఠశాలకు చేరుకుని తరగది గదుల్లోకి వెళ్లిపోయారు. క్లాసులు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా వంటగదిలో పెద్ద శబ్దంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఏం జరిగిందో అన్నభయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వంట సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

వంటగదిలో సిలెండర్ పైప్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగినట్టుగా గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు‌. ప్రమాదంతో అలర్ట్ అయి‌న ఉపాధ్యాయులు విద్యార్థులను క్లాస్ రూంల నుండి వెంటనే సురక్షితంగా బయటకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు‌. ప్రమాద సమయంలో పాఠశాలలో 450 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం‌. ఈ ప్రమాదంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.

వీడియో చూడండి..

Follow Us