AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం.. కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలకు వేళయింది. నేడు ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి మొదలై 29వ తేదీ ఆషాఢశుద్ధ పౌర్ణమి వరకు అంటే 14 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 14 రోజుల పాటు అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరించి ఆరాధిస్తారు.

Telangana: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Warangal Bhadrakali Shakambhari Utsavam
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 11:42 AM

Share

ఓరుగల్లు నగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరి మహోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. ఆషాఢ శుద్ధపాడ్యమి నుండి పౌర్ణమి వరకు పక్షం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు సహస్ర కలిశాభిషేకాలు, గణపతి పూజ, పూర్వంగవిధి కార్యక్రమంతో ఉత్సవాలు మొదలులయ్యాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. దేశంలో మొట్టమొదటి శాకాంబరీ ఉత్సవం జరిగేది ఈ ఆలయంలోనే.. ఇక్కడ ప్రారంభమైన తర్వాతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఉత్సవాల నిత్య క్రమంలో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు

15వ తేదీ: ఉదయం కామేశ్వరి క్రమంలో పూజలు

16వ తేదీ: కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం

17వ తేదీ: కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం

18వ తేదీ: కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం

19వ తేదీ: విరోధినీ క్రమం, వహ్నివాసినీ క్రమం

20వ తేదీ: విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరీ క్రమం

21వ తేదీ: ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం

22వ తేదీ: ఉగ్రప్రభా క్రమం, త్వరితా క్రమం

23వ తేదీ: దీప్తా క్రమం, కులసుందరీ క్రమం

24వ తేదీ: నీలా క్రమం, విజయా క్రమం

25వ తేదీ: ఘనా క్రమం, నీలపతాకా క్రమం

26వ తేదీ: బలాకా క్రమం, విచిత్రా క్రమం

27వ తేదీ: మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం

28వ తేదీ: ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం

29వ తేదీ (పౌర్ణమి): మితా క్రమం. ఈ ముగింపు రోజున అమ్మవారు భక్తులకు ‘సంపూర్ణ శాకాంబరీ’గా దర్శనమిస్తారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రకృతిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించి ఆరాధిస్తారు. ఈ సమయంలో శాకాంబరీ దేవిని దర్శించుకుంటే కరువు కాటకాలు దరిచేరవని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆషాఢ మాసంలో మొట్టమొదటి శాకాంభరీ ఉత్సవాలు భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే ఆరంభమవుతాయి. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. శాకంభరి ఉత్సవాల సందర్భంగా భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు..ఉదయం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయశాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
రైల్వేశాఖ కొత్త టికెట్ రూల్స్.. వాట్సప్‌లో చూపిస్తే..
రైల్వేశాఖ కొత్త టికెట్ రూల్స్.. వాట్సప్‌లో చూపిస్తే..
అర్థరాత్రి MLA ఇంటికెళ్లిన 17మంది గురుకుల విద్యార్ధులు.. ఎందుకంటే
అర్థరాత్రి MLA ఇంటికెళ్లిన 17మంది గురుకుల విద్యార్ధులు.. ఎందుకంటే
ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ - పాక్ మ్యాచ్‌లు..
ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ - పాక్ మ్యాచ్‌లు..
తిరుమలకు వెళ్తున్నారా..? ఇలాంటి వారితో జాగ్రత్త..
తిరుమలకు వెళ్తున్నారా..? ఇలాంటి వారితో జాగ్రత్త..
భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య
భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య
మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి
మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి
అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..!
అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..!
మీ SIR పూర్తయిందా..? లేదా..? మొబైల్ నెంబర్‌తో తెలుసుకోండిలా..
మీ SIR పూర్తయిందా..? లేదా..? మొబైల్ నెంబర్‌తో తెలుసుకోండిలా..
అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. ఉలిక్క పడ్డ జ
అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. ఉలిక్క పడ్డ జ