AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం

నటి విజయశాంతి దివంగత దర్శకుడు టి.కృష్ణతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనను గురువుగా, అన్నగా భావించినట్లు తెలిపారు. రేపటి పౌరులు చిత్రీకరణ సమయంలో టి.కృష్ణ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, ఆయన పని పట్ల అంకితభావం, నటన విషయంలో ఆయన పట్టుదల గురించి వివరించారు.

అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం
Vijayashanthi
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2026 | 11:08 AM

Share

ప్రముఖ నటి విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. కానీ అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. విజయశాంతి ఎక్కువగా రాజకీయాలపైనే దృష్టిసారిస్తున్నారు. గతంలో విజయశాంతి మాట్లాడుతూ..  దివంగత దర్శకుడు టి.కృష్ణతో తనకున్న అనుబంధాన్ని, ఆయన తన జీవితంలో పోషించిన ముఖ్యమైన పాత్రను, అలాగే ఆయన కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. టి.కృష్ణను తాను కేవలం దర్శకుడిగానే కాకుండా, గురువుగా, ఒక అన్నగా భావిస్తానని ఆమె తెలిపారు. ఆయన సినిమాల ద్వారా నాలోని నటిని బయటికి తీసుకురావడం మాత్రమే కాకుండా, ఆయనతో మాకు కుటుంబ బంధం ఉంది. ఒక అన్న చెల్లెళ్ళను ఎంత అపురూపంగా చూసుకుంటారో, అలాగే ఆయన గానీ, వదిన గానీ మమ్మల్ని చూసుకునేవారు. గోపీచంద్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి అందరం ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం” అని విజయశాంతి గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

టి.కృష్ణ పని పట్ల ఎంత నిబద్ధతతో, అంకితభావంతో ఉండేవారో వివరించారు. రేపటి పౌరులు సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆమె ప్రస్తావించారు. టి.కృష్ణ క్యాన్సర్‌తో బాధపడుతూ, బెడ్‌పై పడుకొనే దర్శకత్వం వహిస్తున్న రోజుల్లో, ఒక కోర్ట్ సీన్‌లో నటన సరిగా రాలేదని ఆయన తనపై కోపగించుకున్నారని చెప్పారు. “నేను ఒక పాటర్న్‌లో చేసుకుంటూ వస్తున్నాను. అప్పుడు ఆయన ఇలా చేయాలి కదా, ఎందుకు ఇలా ముడుచుకొని చెప్తావ్ అని గట్టిగా తిట్టారు. నాకు అప్పటి వరకు ఆయన అంత ఎమోషన్ అవడం తెలియదు” అని విజయశాంతి తెలిపారు. ఆ సమయంలో కొద్దిసేపు కూర్చుని, తన పొరపాటును సరిదిద్దుకుని, సింగిల్ టేక్‌లో ఆ సీన్‌ను పూర్తి చేశానని ఆమె వివరించారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోయినా, పని పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనమని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్

టి.కృష్ణ మరణించినప్పుడు విజయశాంతి ఊటీలో కళ్యాణ తాంబూలం సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆ వార్త వినగానే, తన గురువుకు, అన్నకు చివరి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుని, రెండు రైళ్లు మారి స్మశానానికి వెళ్ళానని, కానీ అప్పటికే కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఆయన పట్ల తనకు అంత గౌరవం ఉందని ఆమె చెప్పారు. టి.కృష్ణ మరణానంతరం ఆయన పిల్లల చదువు, బాధ్యతలను విజయశాంతి చూసుకున్నారని ప్రచారం జరిగేది. దీనిపై స్పందిస్తూ, “వాళ్ళది ఏంటంటే, వాళ్ళు ఎవరి దగ్గర ఏమి తీసుకోరు. వదిన ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే ఒకరి సహాయం తీసుకోదు ఆవిడ. వాళ్ళు ఒక మెథడ్‌లో వాళ్ళ లైఫ్ అలా ఉండేది. మేము సహాయం చేయడానికి అడిగాం, కానీ వాళ్ళు తీసుకోలేదు. పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకుని, వారి వారి వృత్తుల్లో స్థిరపడ్డారు. వాళ్ళ ఆలోచనను గౌరవిస్తాను. ఆ గౌరవం మాత్రం నాకు ఇప్పటికీ ఉంది” అని విజయశాంతి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

Gopichand

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us