AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ తిరుగులేని నటుడు, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులే నవ్వులు. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ నటుడు.

అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు
Ntr
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2026 | 11:48 AM

Share

సినీ నటుల అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. కొందరు స్టార్ డమ్ సొంతం చేసుకొని దూసుకుపోతుంటే మరికొందరు రేస్ లో వెనకబడుతూ ఉంటారు. అలాగే ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్స్ అయినా వారు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో ఈ నటుడు ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆతర్వాత టీడీపీ ఆఫీస్ లో ఉద్యోగి అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేసి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చి తిరుగులేని నటుడిగా మారారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు ఎన్టీఆర్ దగ్గర పని చేస్తున్న సమయంలో ఆయనతో తన్నులు కూడా తిన్నాడు ఈ నటుడు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు మనందరి అభిమాన కమెడియన్, దివంగత నటుడు వేణుమాధవ్.

ఇది కూడా చదవండి : జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి

అన్న నందమూరి తారకరామారావు గారి దగ్గర టెలిఫోన్ ఆపరేటర్ గా పని చేశారు వేణుమాధవ్.  ఆ సమయంలో ఓ ఆసక్తికర అనుభవం ఎదురైందని నటుడు వేణు మాధవ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొదట టీడీపీ ఆఫీస్ లో పని చేసిన వేణుమాధవ్. ఆతర్వాత ఎన్టీఆర్ ఇంటి దగ్గర పని చేశారు. ఓ రోజు రాత్రంతా వెలుగుతూ ఉన్న లైట్ తెల్లవారుజామున ఆఫ్ చేయడం మరిచిపోయినందుకు ఎన్టీఆర్ తనను మందలించారని అలాగే ఓ దెబ్బేశారని తెలిపారు, అరగంట తర్వాత తన దోశను పంచుకొని, తప్పును సరిదిద్దుకోమని సూచించారన్నారు.

ఇది కూడా చదవండి : ఆమెకు19 ఆయనకు 31..! 20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్

నన్ను మందలించిన తర్వాత మళ్లీ పిలిచారు. ఆయన ఈరోజు నాకు ఉతుకుడే ఉంటుందని అనుకున్నా.. కానీ ఊహించని విధంగా, అన్నగారు దోశ తింటూ కనిపించారు. “మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు బ్రదర్” అని చెప్పి, తాను తింటున్న దోశలో సగం తీసి వేణు మాధవ్‌కు అందించారట. దెబ్బలు పడతాయనుకున్న వ్యక్తికి దోశ పెట్టి పంపిన ఆ అనుభవం, ఎన్టీఆర్ గొప్ప ఆత్మీయతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. నన్ను అన్నగారు బొమ్మగారు అని పిలిచేవారు అని వేణుమాధవ్ తన అనుభవాన్ని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు

Venu Madhav

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా