AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం, ఇడ్లీ, దోశల్లోకి కమ్మటి ఆంధ్రా స్టైల్ వెల్లుల్లి పప్పుల పొడి.. నెల రోజుల పాటు నిల్వ ఉండేలా ఇలా చేసుకోండి!

తెలుగువారి వంటకాలలో రకరకాల కారం పొడులకు, పప్పుల పొడులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా ఇళ్లలో పుట్నాల పప్పు, కొబ్బరి మరియు కారంతో పప్పుల పొడి చేస్తుంటారు. అయితే విస్మయ్ ఫుడ్ స్టైల్‌లో కరకరలాడే వెల్లుల్లి సువాసనలతో, కాస్త భిన్నంగా చేసే 'వెల్లుల్లి పప్పుల పొడి' నోటికి ఎంతో రుచిగా ఉంటుంది.

Phani CH
|

Updated on: Aug 07, 2026 | 9:53 PM

Share
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పొడి కలుపుకుని తిన్నా, లేదా ఇడ్లీ, దోశలపై చల్లుకుని తిన్నా అమృతతుల్యంగా ఉంటుంది. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే గాలి తగలకుండా డబ్బాలో ఉంచితే నెల రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటుంది.

1 / 5
ఈ వెల్లుల్లి పప్పుల పొడి తయారీకి ముందుగా 100 గ్రాముల వెల్లుల్లి రేకలను పొట్టు పొట్టుగానే కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో 150 గ్రాముల పుట్నాల పప్పు  వేసి వేపాల్సిన అవసరం లేకుండా సన్నటి మంటపై కేవలం వెచ్చబడే వరకు వేయించి పక్కన తీసుకోవాలి.

2 / 5
అదే మూకుడులో 3-4 బ్యాడిగి మిర్చి , 12-15 కారంగా ఉండే ఎండుమిరపకాయలు వేసి సన్నటి మంటపై వేయించాలి. మిర్చి వేగుతుండగా టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా రాళ్ల ఉప్పు వేసి ఒక నిమిషం వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు పాన్‌లో 6-8 చెంచాల నూనె వేడిచేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు (వేరుశనగ గుళ్లు) వేసి ఎర్రగా వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి.

3 / 5
మిగిలిన నూనెలో దంచిన వెల్లుల్లి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయాలి.మిక్సీ జార్‌లో పల్లీలు, వేయించిన ఎండుమిర్చి మిశ్రమం, నిమ్మకాయంత చింతపండు, మరియు పుట్నాల పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

4 / 5
ఆ తర్వాత వేయించి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఒకటి రెండు సార్లు మాత్రమే పల్స్ చేయాలి. వెల్లుల్లి పలుకులుగా ఉంటేనే పొడి తింటుంటే పంటి కింద పడి ఎంతో రుచిగా ఉంటుంది. తయారైన ఈ పొడిని ఎయిర్ టైట్ జార్‌లో భద్రపరిస్తే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.

5 / 5
Follow Us
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..

చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..

భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..

వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..

టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..

ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!

రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో