AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 భాషలు, 300లకుపైగా సినిమాలు..! రూ. 10 రూపాయలతో మొదలుపెట్టి ఇప్పుడు కోట్ల ఆస్తి

ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో చక్రం తిప్పింది. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 14 ఏళ్లకే అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. డాక్టర్ కాబోయి అనుహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. స్టార్ హీరోయిన్ గా రాణించింది.

8 భాషలు, 300లకుపైగా సినిమాలు..! రూ. 10 రూపాయలతో మొదలుపెట్టి ఇప్పుడు కోట్ల ఆస్తి
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2026 | 12:34 PM

Share

అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటిన ముద్దుగుమ్మల్లో ఈ హీరోయిన్ ఒకడు. ఆమె నటన, ఆమె అందం అమోఘం అనే చెప్పాలి. ఆమె కోసం థియేటర్ కు వెళ్లే అభిమానులు లక్షల్లో ఉన్నారు. దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా కలువల్లాంటి కన్నులు.. అందమైన మోము.. సహజనటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 8 వేర్వేరు భాషలలో 300లకుపైగా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు ఆమె గ్లామర్ రంగానికి దూరంగా ఉంటుంది. ఆమె ఓ తెలుగు సినిమా ఫైనాన్షియర్ కుమార్తె. ఆమె చిన్నతనంలో డాక్టర్ కావాలనుకుంది. కానీ ఊహించని విధంగా సినిమాల్లోకి అడుగుపెట్టింది.

ఇది కూడా చదవండి : 23 ఏళ్లకే అన్ని చూసేసా.. ప్రేమ పేరుతో చాలా మంది మోసం చేశారు.. నటి ఎమోషనల్ కామెంట్స్

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులోనే కాదు.. హిందీ, తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. మరోవైపు రాజకీయంలోనూ రాణిస్తున్నారు.  ఆమె మరెవరో కాదు అందాల అభినేత్రి జయప్రద. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా అరంగేట్రం చేసి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయప్రద. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె పేరును జయప్రదగా మార్చారు.

ఇది కూడా చదవండి : అందరూ ఎదో అనుకుంటారు.. కానీ ఆ హీరో గొప్ప డాన్సర్..! అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..

1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాలు నిడివిగల పాట కోసం ఆమెను తీసుకున్నారు. అందుకు గాను జయప్రద పారితోషికం కేవలం రూ. 10 తీసుకుంది. ఆ మూడు నిమిషాల పాత్ర ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది అలా మొదలైన సినీ ప్రస్థానం 2005వరకు దాదాపు మూడు దశాబ్దాల వరకు సాగింది. తెలుగుతోపాటు.. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. 1986 జూన్ 22న సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు జయప్రద. సీనియర్ ఎన్టీఆర్ ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

Jayapradha

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us