AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

నటుడు సమీర్ తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను వెల్లడించారు. ముస్లిం తండ్రి, బ్రాహ్మణ తల్లికి పుట్టిన సమీర్, తండ్రి నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన పిల్లలకు అలాంటి సమస్యలు రాకూడదని హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు, ఇంటి పేరు కూడా మార్చుకున్నట్లు తెలిపారు.

నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు
sameer
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2026 | 8:48 AM

Share

ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సమీర్.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు సమీర్. కాగా గతంలో సమీర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సమీర్ ముస్లిం తండ్రి (పేరు హసన్), బ్రాహ్మణ తల్లికి జన్మించారు. తన తండ్రికి అప్పటికే పెళ్లయిందని, ఈ విషయం తన తల్లికి తెలియదని సమీర్ తెలిపారు. తాను పుట్టిన మూడు నెలలకే తన తండ్రి దుబాయ్‌కి బదిలీపై వెళ్లడంతో, తల్లితో పాటు వెళ్లే క్రమంలో పిల్లలతో అక్కడ ఇబ్బందులు ఉంటాయని చెప్పి, సమీర్‌ను అతని అమ్మమ్మ గారి దగ్గర వదిలి వెళ్లారని తెలిపారు. కొన్నాళ్ళకు తన చెల్లి పుట్టిన తర్వాత, ఆమెను కూడా అమ్మమ్మ ఇంట్లో వదిలివేసి, తల్లిదండ్రులు షార్జాకు వెళ్లిపోయారని తెలిపాడు సమీర్.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

దీంతో సమీర్, అతని చెల్లి చిన్నతనం అంతా అమ్మమ్మ, తాతయ్య, మావయ్యల సంరక్షణలో గడిచింది. తమ తల్లి తమను దగ్గరకు తెచ్చుకోవాలని జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉన్నారని, కానీ అది సాధ్యం కాలేదని సమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొడైకెనాల్‌లోని కొడై పబ్లిక్ స్కూల్‌లో బోర్డింగ్ లైఫ్ గడిపినట్లు తెలిపారు సమీర్. తాను డిగ్రీ చదువుతున్నప్పుడు, తన తల్లిని ఇక తండ్రిని వదిలేసి వచ్చేయమని చెప్పినట్లు పేర్కొన్నారు. కేవలం కన్నంత మాత్రాన తండ్రి కాలేరని, పిల్లలను పెంచే వాడే తండ్రి అని సమీర్ అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనల వల్ల తండ్రిపై తనకు ఉన్న గౌరవం పూర్తిగా పోయిందని చెప్పారు. తన జీవితంలో తండ్రి అనే స్థానం లేదని, తన బాల్యం నుంచే అది సోలో పెర్ఫార్మెన్స్ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

తన జీవితంలో కేవలం ఆరుసార్లు మాత్రమే తండ్రిని కలుసుకున్నానని, ఆ కలుసుకున్న సమయాల్లో కూడా పెద్దగా మాటలు ఉండేవి కావని తెలిపారు సమీర్. తన తండ్రి మొదటి భార్యకు పిల్లలు ఉన్నారని, వారిని తీసుకెళ్ళిన తన తండ్రి, తమను మాత్రం తీసుకెళ్లలేదని తెలిపారు. భవిష్యత్తులో తన పిల్లలకు ఎలాంటి మతపరమైన సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో తాను హిందూ మతంలోకి మారినట్లు సమీర్ స్పష్టం చేశారు. సమీర్ హసన్ అనే తన పేరులోని హసన్ అనే సర్ నేమ్‌ను వద్దనుకుని, తన తల్లింటి సర్ నేమ్‌ను స్వీకరించారు. సమీర్ అంటే ఆంజనేయుడి అని గతంలో చిరంజీవి అడిగినప్పుడు తాను చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు సమీర్. తన భార్య ముసునూరి అపర్ణ బ్రాహ్మణురాలు కావడంతో, పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.. కేవలం రూ. 1600తో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు సమీర్ తెలిపారు. తన కష్టాలు, సవాళ్లు తనను మరింత దృఢంగా మార్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us