Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం ముస్తాబవుతోంది .

బిగ్ బాస్ సీజన్ 10కోసం అందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 10 మొదలుకానుంది. ఇప్పటికే 9సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 10కోసం సిద్ధం అవుతుంది. గత సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో సీజన్ 10ను మరింత కట్టుదిట్టంగా, ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దశావతారం పేరుతో సీజన్ 10ను సిద్ధం చేస్తున్నారు. కాగా గత సీజన్స్ లానే ఈసారి కూడా సామాన్యులకు పెద్ద పీట వేస్తున్నారు. సీజన్ 9లోకి అగ్నిపరీక్ష పేరుతో కొంతమంది సామాన్యులను సెలక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రేటలు అంటూ ఇద్దరి మధ్య మంచి పోటీ పెట్టారు. ఈసారి కూడా లానే ఉండనుంది. సామాన్యుల కోసం అగ్నిపరీక్ష 2 ప్రారంభం కానుంది.
ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది
సామాన్యులను సెలక్ట్ చేసేందుకు అగ్నిపరీక్షకు ఆడిషన్స్ పంపించండి అంటూ ఇప్పటికే నాగార్జున అనౌన్స్ చేశారు. దాంతో వందల కొద్దీ ఆడిషన్స్ బిగ్ బాస్ టీమ్ కు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు చిత్ర విచిత్రమైన వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఆడిషన్స్ ఇస్తున్నారు మరికొందరు. ఇక బషీర్ మాస్టర్ కూడా నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..
బషీర్ మాస్టర్.. సోషల్ మీడియా వాడే ప్రతిఒక్కరికి తెలిసిన పేరే ఇది. ఒకప్పుడు ఢీ షోలో పాల్గొన్నాడు బషీర్. ఆతర్వాత చాలా కాలం కనిపించలేదు. ఆతర్వాత సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తూ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. కొరియోగ్రాఫర్ అంటూ కొంతమంది పిల్లలకు డాన్స్ క్లాస్ లు చెప్పడం.. అలాగే డాన్స్ వీడియోలు చేస్తూ వైరల్ అయ్యాడు. తాజాగా బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నా అంటూ ఓ ఆడిషన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో నేను కొరియోగ్రాఫర్ ను, కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫ్ చేశాను, నాకు ఇన్ స్టా, ఫేస్ బుక్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే చాలా షోలు చేశాను. నన్ను బిగ్ బాస్ లోకి తీసుకుంటే నా టాలెంట్ ఏంటో చూపిస్తా.. అలాగే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అందుకే నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా.. అంటూ వీడియో షేర్ చేశాడు బషీర్ మాస్టర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి : ఆర్ఎక్స్ 100 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నుంచి రావు బహదూర్ వరకు.. అదరగొడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
బషీర్ మాస్టర్ వీడియో
View this post on Instagram
బషీర్ మాస్టర్ వీడియో
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




