AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేం సరదా సరదాగానే సినిమాలు చూస్తాం..! ఇలాంటి మూవీని ఎందుకు వదిలేస్తాం..!! రూ. 14 కోట్లు పెడితే..రూ.రూ. 450 వచ్చాయి

ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు దుమ్మురేపుతున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు సంచలన విజయాన్ని సాధిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలై వెయ్యికోట్లకు పైగా వసూల్ చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు. కథ మంచిగా ఉంటే చాలు ఇతర బాషల సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.

మేం సరదా సరదాగానే సినిమాలు చూస్తాం..! ఇలాంటి మూవీని ఎందుకు వదిలేస్తాం..!! రూ. 14 కోట్లు పెడితే..రూ.రూ. 450 వచ్చాయి
Movie
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2026 | 8:04 PM

Share

ఓటీటీలో చాలా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటు థియేటర్స్ లో కొత్త సినిమాలు మంచి విజయాలను అందుకుంటుంటే.. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల కూడా ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన సినిమాలు కూడా ఓటీటీలో మెప్పిస్తాయి. థియేటర్లలో డిజాస్టర్ అయిన చిత్రాలు సైతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ సినిమా కొన్నేళ్ళుగా ఓటీటీలో దుమురేపుతుంది. ఈ సినిమా మొత్తం ఓ ఎత్తు  క్లైమాక్స్ ఒకెత్తు.. ఆ సినిమా మరేదో కాదు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ముందు కన్నడలో రిలీజ్ చేశారు. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆతర్వాత ఇతర భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి : Hema : అమ్మబాబోయ్.. హేమ కూతుర్ని చూశారా..!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

2022 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన నిలిచింది ఈ సినిమా. థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారింది. కేవలం రూ. 14 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొత్తం వసూళ్లు రూ. 400 నుండి 450 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 6 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండ్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాకు ప్రీక్వెల్ కూడా తెరకెక్కింది. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ‘కాంతార’కి ముందు కథను చూపించారు. ఈ సినిమాకు కూడా రిషబ్ శెట్టి స్వయంగా రచన, దర్శకత్వం వహించారు. హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించారు.

ఇది కూడా చదవండి : Pawan Kalyan: డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్

కాంతార సినిమాలో రిషబ్ శెట్టితో  పాటు సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ నటించారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. అలాగే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును అందుకుంది. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు ఆ ప్రాంత సంప్రదాయం.. మనిషి దురాశను చూపిస్తుంది. స్థానిక జానపద కథలు, ఆచారాలు, కర్ణాటకలోని దక్షిణ కన్నడలోని ప్రసిద్ధ సంప్రదాయం భూత కోలను ఎంతో అందంగా వెండితెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం కాంతార చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 9 సినిమాలు.. 5 హిట్లు..! టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us