AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌లో టాపర్..! IAS ఆఫీసర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరోయిన్

సాధారణంగా సినీ పరిశ్రమలో చాలా మంది తారలు గమ్యం వేరుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను కాకుండా మరోదారిని ఎంచుకున్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ తాము ఎప్పుడూ నటిగా మారాలని అనుకోలేదని.. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని అంటారు.

ఇంటర్‌లో టాపర్..! IAS ఆఫీసర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరోయిన్
Acctress
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2026 | 10:16 AM

Share

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ మరేదో చేయాలని కలలు కన్నారు కానీ ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది హీరోయిన్ డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని కలలు కానీ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కానీ ఊహించని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే పలు యాడ్స్ లోనూ నటించింది. ఈ ముద్దుగుమ్మ నటించిన వాసెలిన్ యాడ్ అప్పుడు పపౌలర్ అయ్యింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

ఇవి కూడా చదవండి

ఆమె మరెవరో కాదు ముద్దుగుమ్మ హీరోయిన్ రాశీ ఖన్నా.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రాశీ ఖన్నా.. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు దోచేసింది. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ సరసన అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి స్టార్ హీరోల మూవీలో అవకాశాలు మాత్రం రాలేదు.

ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి రాశీ ఖన్నా తన సినీ ప్రయాణాన్ని హిందీ సినిమాతోనే ప్రారంభించింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతోనే నటిగా పరిచయమైంది. ఈ మూవీలో రాశీ ఖన్నా పోషించిన పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగు, తమిళంలో భాషలలో వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

రాశీ ఖన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us