అందరూ ఎదో అనుకుంటారు.. కానీ ఆ హీరో గొప్ప డాన్సర్..! అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..
ప్రముఖ నటి భానుప్రియ తన డాన్స్ గురించి, అలాగే ఓ స్టార్ హీరోతో డ్యాన్స్ అనుభవాలు, పర్ఫెక్షన్ పట్ల తన ఆసక్తికర కామెంట్స్ చేశారు. కూచిపూడి నేపథ్యం నుంచి కమర్షియల్ డ్యాన్స్ వరకు అనేక విషయాలను పంచుకున్నారు భాను ప్రియా .

అలనాటి అందాల తారల్లో భానుప్రియ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు భాను ప్రియా. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు భాను ప్రియా. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలతో పాటు, అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో, ఆమె తన నృత్య నేపథ్యం, తోటి తారలతో డ్యాన్స్ అనుభవాలు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో పనిచేసిన సందర్భాలు, అలాగే తన వ్యక్తిగత అభిరుచులపై మాట్లాడారు. భానుప్రియకు నృత్యం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. స్వర్ణకమలం, ఆలాపన వంటి చిత్రాలలో ఆమె క్లాసికల్ నృత్య ప్రదర్శనలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. విశ్వనాథ్ , జంధ్యాల వంటి దర్శకులతో పాటు, కోదండరామిరెడ్డి , దాసరి నారాయణరావు వంటి కమర్షియల్ దర్శకులతోనూ ఆమె పనిచేశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కార్తీక పౌర్ణమి చిత్రంలోని తన పాత్రను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే చంద్రలేఖ సినిమాలో తాను చేసిన డ్రమ్ డ్యాన్స్ కూడా ఒక ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అని, పెద్ద డ్రమ్స్‌పై డ్యాన్స్ చేయడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. మణిరత్నం గారితో కొన్ని స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు, థియేటర్ షోలు కూడా చేశానని, నేట్రే ఇండ్రు నాలై అందులో ఒకటని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు
భానుప్రియ క్లాసికల్ డ్యాన్స్‌లోనే కాకుండా, ర్యాప్, ట్యాప్, డిస్కో వంటి పాటలలో కూడా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో ఆమె చేసిన డ్యాన్స్‌లు విశేష ప్రజాదరణ పొందాయి. చిరంజీవి గారితో డ్యాన్స్ చేసేటప్పుడు ఒక ఎనర్జిటిక్ అనుభూతి ఉంటుందని, కొన్నిసార్లు తాను కొంచెం ఓవర్ చేస్తున్నానేమో అనిపించేదని భానుప్రియ తెలిపారు. అయితే, చిరంజీవి పలు సందర్భాల్లో రాధిక, రాధ, భానుప్రియలను తన బెస్ట్ డ్యాన్స్ పెయిర్‌గా పేర్కొన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, చిరంజీవి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పదేపదే చెప్పేవారని, అదేమిటంటే, “మిగతా వారందరూ డ్యాన్స్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఒక కో-స్టార్‌తో చేస్తున్నట్లు చేస్తారు. కానీ భానుప్రియ మాత్రం ఒక పోటీదారుతో చేస్తున్నట్లు ఫీల్ అయి చేస్తారు. ఆమె చాలా టెక్నికాలిటీస్ చూస్తారు, ఫుట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి” అని చిరంజీవి అనేవారట. అరవింద్ గారు కూడా ఈ మాట అన్నారని భానుప్రియ చెప్పారు.
ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
తనకు ఎప్పుడూ బాగా చేయాలి అనే తపన ఉండేదని, అది చిరంజీవి కంటే బాగా చేయాలనే ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. అందరూ ఎదో అనుకుంటారు కానీ నా ఉద్దేశ్యం అది కాదు. “ఆయన కంటే బాగా చేయలేం. హి వాస్ సో అడ్మైరింగ్ గా ఆయన డ్యాన్స్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది” అని భానుప్రియ అన్నారు. తన క్లాసికల్ డ్యాన్స్ గురువులు, సరిగ్గా తాళం పడకపోతే కర్ర విసిరేసేవారని, ఆ పర్ఫెక్షన్ మైండ్‌లో ఉండిపోయిందని, అందుకే ప్రతీ డ్యాన్స్‌లోనూ పర్ఫెక్ట్‌గా చేయాలనే తపన ఉండేదని ఆమె వివరించారు. పాదాల కదలికలు, చేతులు, ముఖంలో భావాలు – ఇవన్నీ సరిగ్గా ఉండాలని ఆమె ఎక్కువ ఫోకస్ చేసేవారట. డిస్కో, ర్యాప్, ట్యాప్ సాంగ్స్ చేసినప్పుడు కూడా ఆ స్టైల్, సరదాను ఎంజాయ్ చేసేదాన్నని, అది ఏదో విదేశాలు చుట్టొచ్చినట్లు ఉండేదని, అమెరికా అల్లుడు వంటి చిత్రాలలో అలాంటి అవకాశం దక్కిందని ఆమె అన్నారు.
ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




