AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్

సీనియర్ హీరోయిన్, మాజీ మంత్ర రోజా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు.. ఇటీవలే ఆమె నటించిన ఓ తమిళ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. గతంలో లాగే ఇప్పుడు కూడా వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు రోజా.

Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్
Ram Charan, Roja Selvamani
Basha Shek
|

Updated on: Aug 07, 2026 | 9:48 PM

Share

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు వివిధ దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, జగపతిబాబు.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా చేశారామె. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటిన ఘనత రోజా సొంతం. నగరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఏపీ మంత్రిగా కూడా సేవలందించారు. దీంతో జబర్దస్త్ తో పాటు సినిమాలు, టీవీ షోలన్నింటికీ గుడ్ బై చెప్పేశారామె. అయితే ఇప్పుడు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల రోజా నటించిన ఒక తమిళ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఇక బుల్లితెరపై కూడా పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నారీ అందాల తార. ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతోన్న డ్రామా జూనియర్స్ సీజన్ 9కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు రోజా. ఈ టీవీ షోలో ఆమెతో పాటు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రముఖ హీరో శ్రీకాంత్ కూడా జడ్జీలుగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా డ్రామా జూనియర్స్ సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అందులో రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ అందరూ తమ స్కిట్లతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. అయితే స్కిట్స్ పూర్తయిన వెంటనే రోజా స్టేజ్ పైకి వస్తారు. సుధీర్ ను చూస్తూ ‘ అన్నయ్య నాకు స్కూటీ నేర్పించవా’ అని అడుగుతారు. దీంతో సుధీర్ ‘ ట్రాఫిక్ పోలీసు ఎక్కడైనా మిమ్మల్ని ఆపి.. ఆర్సీ చూపించమంటే ఏం చేస్తారు ?అని రోజాను అడుగుతాడు. అందుకు రోజా ‘రామ్ చరణ్ (ఆర్సీ) గారి ఫోటో చూపిస్తాను’ అంటూ పంచ్ వేస్తారు. దీంతో అక్కడున్న వారందరూ గట్టిగా నవ్వేస్తారు. మధ్యలో హీరో శ్రీకాంత్ కలగజేసుకుని ‘నీ చెల్లెలు తెలివి తేటు మామూలు తెలివితేటలు’ కాదంటూ రోజాకు కౌంటర్ ఇస్తాడు. ఇలా మొత్తానికి తమ కామెడీ పంచులతో షోను రక్తి కట్టించారు రోజా, శ్రీకాంత్, సుధీర్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు రోజా. ‘ముఠా మేస్త్రి’ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి రామ్ చరణ్ కు షూటింగ్ కు తీసుకొచ్చేవాడు. చరణ్ చాలా అల్లరి పిల్లాడని, కానీ స్కూల్లో చేరాక సైలెంట్ అయిపోయాడు. షూటింగ్ సెట్ లో తనను నేను ఎత్తుకుని ఆడించేదాన్ని. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన చూసి నేనెంతో గర్వపడ్డాను. అతని డ్యాన్స్ లో తండ్రి చిరంజీవి కనిపిస్తుంటాడు’ అని రోజా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
క్రోనీ కేపిటలిజం కోసం మస్క్‌ మామ దొంగాట?
క్రోనీ కేపిటలిజం కోసం మస్క్‌ మామ దొంగాట?
నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్
నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్