AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు

సీనియర్ నటి సుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు ఆమె. సహాయక పాత్రల్లో నటిస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు సుధ. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వివిధ తారలతో తన అనుభవాల గురించి పంచుకున్నారు.

చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు
Sudha
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2026 | 12:50 PM

Share

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో ఒకరైన సుధ అందరికి సుపరిచితురాలే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె. సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు సుధ. అమ్మ, అత్త, వదిన పాత్రల్లో తన సహజనటనతో అలరిస్తున్నారు సుధ.  ప్రస్తుతం తక్కువగా సినిమాలలో నటిస్తున్నారు. వరుసగా ఆఫర్లు వస్తున్నా, నచ్చిన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వైవిధ్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుధ.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఆమె ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : 23 ఏళ్లకే అన్ని చూసేసా.. ప్రేమ పేరుతో చాలా మంది మోసం చేశారు.. నటి ఎమోషనల్ కామెంట్స్

సుధా మాట్లాడుతూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే తాను ఎక్కువగా నటించానని సుధ చెప్పారు. అలాగే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేశానని అన్నారు సుధ. సీనియర్ హీరోల దగ్గర నుంచి ఇప్పటికి జనరేషన్ యంగ్ హీరోల వరకు ఎంతో మందితో కలిసి పని చేసే అవకాశం దక్కింది అని ఆమె అన్నారు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న చాలా మంది హీరోలను తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని సుధ చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన ఉదయ్ కిరణ్ తనను ప్రేమగా అమ్మ అని పిలిచేవాడని, మరికొందరు యంగ్ హీరోలు కూడా తనను అమ్మ అని పిలుస్తారని సుధ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి : అందరూ ఎదో అనుకుంటారు.. కానీ ఆ హీరో గొప్ప డాన్సర్..! అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..

హీరో మంచు మనోజ్ తో తనకు మంచి బాండింగ్ ఉండేదని సుధ తెలిపారు. అప్పట్లో మేజర్ చంద్రకాంత్ షూటింగ్‌ సమయంలో మనోజ్ సరిగ్గా అన్నం తినకపోతే, వాళ్ళమ్మ కొట్టేవారని, ఆ సమయంలో మనోజ్ వాళ్ళమ్మ తనకు నచ్చడం లేదని తన దగ్గరికి వెళ్తానని చెప్పేవాడని సుధ అన్నారు. చిన్నప్పుడు ఎత్తుకొని పెంచానని ఆమె అన్నారు. అలాగే మనోజ్ కు నేను అన్నం తినిపించేదాన్ని అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉంది అంటూ సుధ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు
అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్