AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా బయోపిక్‌లో ఆమే హీరోయిన్‌గా నటించాలి.. మనసులో మాట బయటపెట్టిన హేమమాలిని

బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్‌ హేమ మాలిని.. సినీ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల తార.. ఇప్పటికీ తన నటనతో మైమరపిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు .

నా బయోపిక్‌లో ఆమే హీరోయిన్‌గా నటించాలి.. మనసులో మాట బయటపెట్టిన హేమమాలిని
Hema Malini
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2026 | 11:17 AM

Share

బాలీవుడ్‌లో డ్రీమ్‌గర్ల్‌గా పేరొందిన దిగ్గజ నటి హేమమాలిని, తన జీవిత చరిత్రపై సినిమా చేస్తే, అందులో తన పాత్రకు సరైన ఎంపిక దీపికా పదుకొణె అని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. చిత్ర పరిశ్రమలో తన 60 అద్భుతమైన సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో హేమమాలిని ఈ విషయాన్ని తెలిపారు. తన సుదీర్ఘ కెరీర్‌లోని ప్రయాణం, అనుభవాల గురించి పంచుకున్న ఈ సందర్భంలో, తన బయోపిక్‌లో ఎవరు నటించాలనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. ఎక్కువ ఆలోచించకుండా హేమమాలిని టక్కున దీపికా పదుకొణె పేరు చెప్పారు. దీపిక కావాలనుకుంటే ఆ పాత్రను చక్కగా పోషించగలదని అన్నారు. దీపికా పదుకొణె అందం, అద్భుతమైన నటన తనకు ఇష్టమని హేమమాలిని తెలిపారు. ఇక ఇప్పుడు ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్

గతంలో అంటే.. 2017లో హేమమాలిని తన ఆత్మకథ “హేమమాలిని: బియాండ్ ది డ్రీమ్ గర్ల్” పుస్తకావిష్కరణకు దీపికా పదుకొణె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిందని తెలుస్తుంది. అంతేకాకుండా, అభిమానులు ఈ ఇద్దరి మధ్య మరొక ప్రత్యేకమైన కనెక్షన్‌ను కూడా గుర్తు చేసుకుంటున్నారు. దీపికా పదుకొణె అరంగేట్రం చేసిన ఓం శాంతి ఓం సినిమాలో ఆమె పోషించిన శాంతి అనే పాత్రను కూడా డ్రీమ్‌గర్ల్ అని పిలుస్తారు. నిజ జీవితంలో డ్రీమ్‌గర్ల్ అనే పేరు వినగానే వెంటనే హేమమాలిని ముఖమే గుర్తుకు వస్తుంది. ఈ రెండు అంశాలు కలిపి, అభిమానులు దీపికా పదుకొణెను హేమమాలిని బయోపిక్‌కు సరైన ఎంపికగా భావించడానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

ప్రస్తుతం, హేమమాలిని బయోపిక్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కేవలం హేమమాలిని కోరిక మాత్రమే. అయితే, ఆమె ఈ కోరికను వ్యక్తం చేసిన వెంటనే.. సోషల్ మీడియాలో అభిమానులు దీపికా పదుకొణెను డ్రీమ్‌గర్ల్ పాత్రలో చూడాలని డిమాండ్ చేస్తున్నారు. దీపికా పదుకొణె గ్రేస్, బ్యూటీ, అద్భుతమైన నటన సామర్థ్యం ఈ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయగలవని అనేక మంది అభిమానులు, నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో హేమమాలిని బయోపిక్ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందా.., ఒకవేళ దాలిస్తే దీపికా పదుకొణె అందులో భాగమవుతుందా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us