AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమెతో సినిమా చేయాలని ఉంది

దుల్కర్ సల్మాన్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసి.. ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. హీరోగా తనదైన శైలీలో రాణిస్తున్నాడు. మలయాళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

నాకు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమెతో సినిమా చేయాలని ఉంది
Dulquer Salman
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2026 | 6:55 AM

Share

దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఆయన సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది.  ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో.. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అని లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు దుల్కర్.  ప్రస్తుతం ఈ స్టార్ హీరో శ్రీ శ్రీ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో దుల్కర్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. ఇదెలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ తన కెరీర్ గురించి కాకుండానే పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అలాగే తనకు ఓ హీరోయిన్ తో నటించాలని ఉందని వెల్లడించారు.  ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ అందాల తార కాజోల్. ఎన్నో హిట్ చిత్రాల్లో కాజోల్ తన పాత్రలకు ప్రాణం పోసిన తీరు ఎంతో అందంగా ఉంటుందని తెలిపాడు దుల్కర్. కాజోల్ పోషించే పాత్రలకు అన్ని భావోద్వేగాలను ప్రేక్షకులు నిజంగా అర్థం చేసుకోగలరని అన్నారు. ‘నాకు కాజోల్‌తో నటించాలని ఉంది. ప్రతి సినిమాలో ఆమె పాత్రలను చూపించిన తీరు అద్భుతం. తన పాత్రలకు ఎంత అందంగా జీవం పోస్తుంది. ప్రేక్షకులు తమ ప్రతి కథలోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఆమె నవ్వితే గుండెల్లో నుంచి నవ్వినట్లుగా అనిపిస్తుంది. ఇక ఆమె ఏడ్చే పాత్రలు.. అదే ఎమోషనల్ రోల్స్ చేస్తే నిజంగానే జరిగిందా అన్నట్లుగా కనిపిస్తుంది. ఆమె పాత్రలను అంత చిత్తశుద్ధితో పోషిస్తుంది ‘ అన్నారు దుల్కర్ సల్మాన్.

దుల్కర్ సల్మాన్ చివరిగా నటించిన చిత్రం కాంత. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు శ్రీ శ్రీ అనే సినిమాతో రానున్నాడు దుల్కర్. నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ DQ41తో బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us