AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIR Status Online: మీ SIR ప్రక్రియ పూర్తయిందా..? లేదా? మొబైల్ నెంబర్‌తో సులువుగా స్టేటస్ తెలుసుకోండిలా..

SIR Enumeration Status: మీరు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ఇచ్చారా.. మీ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందా.. లేదా.. ఈ విషయాన్ని మీరు ఆన్‌లైన్‌లో సులువుగా తెలుసుకోవచ్చు. జస్ట్ మీ మొబైల్ నెంబర్, ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా సులువుగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

SIR Status Online: మీ SIR ప్రక్రియ పూర్తయిందా..? లేదా? మొబైల్ నెంబర్‌తో సులువుగా స్టేటస్ తెలుసుకోండిలా..
Sir Process Online
Venkatrao Lella
|

Updated on: Jul 15, 2026 | 11:12 AM

Share

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ప్రతీఒక్క ఓటర్ పాల్గొనాల్సి ఉంటుంది. లేకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎమ్యూనరేషన్ ఫారం అందిస్తారు. ఈ ఫారంతో మీ వివరాలు పూర్తి చేయడంతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి తిరిగి బీఎల్వోలకు అందించాల్సి ఉంటుంది. ఫారం ఇచ్చిన రెండు, మూడు రోజుల తర్వాత బీఎల్వోలు మళ్లీ మీ ఇంటికొచ్చి ఫారం తీసుకుని వెళతారు. ఒకవేళ బీఎల్‌ఓ రాకపోతే మీరే వెళ్లి అందించాలి. లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిల్ చేసిన ఫారంను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి డిజిటలైజేషన్ చేస్తారు. సీఈసీ డేటాబేస్‌లో మీ ఎస్ఐఆర్ వివరాలను అప్డేట్ చేస్తున్నారు. అయితే మీ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందా..లేదా అనేది ఆన్‌లైన్‌లో సులువుగా తెలుసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

-కేంద్ర ఎన్నికల సంఘం సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ https://voters.eci.gov.in/homepageలోకి వెళ్లండి

-హోమ్ పేజీలో పైన కనిపించే ఫిల్ ఎన్యూమరేషన్ ఫారంపై క్లిక్ చేయండి

-మీ మొబైల్ నెంబర్ లేదా ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయండి

-క్యాప్చా ఎంటర్ చేయండి

-రిక్వెస్ట్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయండి

-మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-అనంతరం వెరిఫై అండ్ లాగిన్‌పై క్లిక్ చేయండి

-ఆ తర్వాత మీ స్టేట్ ఎంచుకోండి

-మీ ఓటర్ ఐడీ నెంబర్ మళ్లీ ఎంటర్ చేయండి

-అనంతరం సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి

-Your form has already been submitted. For more details contact your BLO అని స్క్రీన్‌పై కనిస్తే మీ ఎస్‌ఐఆర్ పూర్తి అయినట్లు లెక్క

ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం ఫిల్ చేయడం ఎలా..?

https://voters.eci.gov.in/homepage పోర్టల్‌లోకి వెళ్లండి

-ఫిల్ ఎన్యూమరేషన్ ఫారంపై క్లిక్ చేయండి

-ఆ తర్వాత మొబైల్ నెంటర్, క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి

-ఓటీపీని నమోదు చేసి లాగిన్ అవ్వండి

-అవసరమైన వివరాలు నమోదు చేయండి

-ఫిల్ చేశాక డౌన్ లోడ్ చేసుకుని బీఎల్‌వోకు అందించండి

2002 ఓటరు జాబితా కనిపెట్టడం ఎలా..?

https://sirhnosearch.shop/ పోర్టల్‌లోకి వెళ్లండి -2002లో ఓటరు ఉన్న జిల్లా, అసెంబ్లీ, ఇంటి నంబరును టైప్‌ చేస్తే వివరాలు వస్తాయి

Follow Us