AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. ఉలిక్క పడ్డ జనం.. పరుగో పరుగు

అడవుల్లో ఆహారం కరువై ఈ మధ్య కాలంలో వణ్యప్రాణులు తచరూ జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలానే అడవి నుండి ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి గ్రామస్తులను తీవ్ర భాయందోళనకు గురిచేసింది. జనాలకు రాత్రంతా కంటి మీద కునుకులేకుండా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. ఉలిక్క పడ్డ జనం.. పరుగో పరుగు
Jangaon Bear Scare
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 10:52 AM

Share

జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. సమీప అడవుల నుండి దారితప్పి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి గ్రామ విధుల్లో స్వైర విహారం చేసింది. ఎలుగుబంటి సంచరించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళలో ఇళ్ల సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో ఆరుబయట ఉన్న చిన్నారులు , పెద్దలంతా ఇండ్లలోకి పరుగులు పెట్టారు.

అది గమనించిన గ్రామ యువకులు ఒక్కసారిగా అప్రమత్తమై ఎలుగుబంటిని వీడియోలు, ఫోటోలను తీసి గ్రామ వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి గ్రామస్తులను బయటకి రాకుండా అప్రమత్తం చేశారు. ఆతర్వాత స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చేలోపు గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకొని భారీ శబ్ధాలు చేస్తూ ఎలుగుబంటిని గ్రామ శివారులోకి తరమేశారు. దీంతో ఆ ఎలుగుబంటి ఊరి చివరల్లో ఉన్న ఓ వాటర్ ప్లాంట్ సమీపంలోని పాడుబడ్డ పాత గొడల్లోకి దూరింది.

అయితే అది ఎప్పుడు మళ్లీ బయటకు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందో ఏమో అనే భయంతో గ్రాస్తులు రాత్రం నిద్రలేకుండా గడిపారు. ఎట్టకేలకు అర్దరాత్రి గ్రామానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి దగ్గరకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోన్‌లో బంధించే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం విఫయం అయింది.

ఇక తెల్లవారుజూమును ఆ ఎలుగుబంటే గోడపై నుండి దూకి పంట పొలాల మీదుగా అడవిలోకి వెల్లిపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ అధికారులు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో గ్రామస్తులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఏవైనా వణ్య ప్రాణులు కనిపిస్తే.. అధికారులకు సమాచారం ఇవ్వాలని.. దానిపై దాడులు చేయడం వంటి చేయ కూడదని సూచించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us