ఇది మాములు లడ్డు కాదు.. బాబోయ్ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతోంది.. కొబ్బరి లాంటి టేస్ట్ తో..
ఒకప్పుడు కొత్త కొత్త వంటకాల గురించి తెలుసుకోవాలంటే.. కేవలం టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారానే సాధ్యమయ్యేది. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఇది మరింత ఈజీ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఫుడ్ రీల్స్ చూసి ఇట్టే ఇంట్లో తయారు చేసుకుంటున్నారు జనాలు. తాజాగా బ్రెజిల్ దేశానికి చెందిన ఓ వంటకం ఇప్పుడు తెగ ట్రెండింగ్‌లోకి వచ్చింది. చాలా మంది ఇండియన్స్ ఈ ఫుడ్‌ను తెగ ఇష్టపడుతున్నారు. ఇంతకూ ఏంటా ఫుడ్.. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ అనేక వంటకాలకు సంబంధించిన రెసిపీస్ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే జనాలకు ఎక్కవగా నచ్చుతాయి. జనాటు వాటిని సేవ్ చేసుకొని ఇంట్లో వండుకోవడానికి ట్రై చేస్తారు. అయితే అలాంటి వాటిలో ఇప్పుడు బ్రెజిల్ దేశానికి చెందిన బాలా బయానా అనే స్వీట్ ఒకటి ఇండియన్ ఫుడ్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చూడ్డానికి గులాబ్ జామూన్‌లా కనిపించే ఈ స్వీట్‌కు జనాల తెగ ఫిదా అయిపోతున్నారు. జూన్ 21 ఫస్ట్‌న ఇన్‌స్టాలో అప్‌లోడ్ అయిన ఈ రెసిపీకి సంబంధించిన వీడియోకు ఇప్పటి వరకు 27 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టా వీడియో ప్రకారం.. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం.
బాలా బయానా తయారీకి కావలసిన పదార్థాలు
- 400 ML కండెన్స్‌డ్ మిల్క్
- 120-150 గ్రాములు ఎండిన కొబ్బరి పొడి
- 20 గ్రాముల వెన్న
- చిటికెడు ఉప్పు
- క్యారమెల్ కోసం 300 గ్రాముల చక్కెర
- అరకప్ప వాటర్
బాలా బయానా తయారీ విధానం
బ్రెజిల్ దేశానికి ఈ బాలా బయానా స్వీట్‌ను ఇంట్లో తయారు చేసుకోవడం చాలా ఈజీ.. ఇది సేమ్ మన గులాబ్ జామూన్ చేసిన విదంగానే చేయవచ్చు. ఇందుకోసం ముందు ఒక పాన్‌లో కండెన్స్‌డ్ మిల్క్, కొబ్బరి పొడి, వెన్న, ఉప్పు వేసి చిన్న మంటపై ఉడికించాలి. తర్వాత మొదట గది ఉష్ణ్రోగత వద్ద తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత దానిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.
ఇప్పుడు ఈ ఉండలను గట్టిపడే వరకు మరో 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి, అది గోధుమ రంగు క్యారమెల్‌గా మారేంత వరకు ఉడికించాలి. తర్వాత ఫ్రిజ్‌లో నుండి తీసిన కొబ్బరి ఉండలను ఈ వేడి క్యారమెల్‌లో ముంచి, దానికి క్యారమెల్‌ను పెద్దగా ఉండకుండా, బటర్ పేపర్ పై ఉంచాలి. కాసేపటి తర్వాత అది ఆరిపోయి గట్టిపడుతుంది.. అంతే ఏంతో టేస్టీగా ఉండే “బాలా బయానా” రెడీ అయినట్టే.. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి.. ఎలా ఉందో చెప్పండి.
రెసిపీకి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది..
View this post on Instagram
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
