AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం తింటున్నారా.. ప్లాస్టిక్ తింటున్నారా.. కల్తీ బియ్యాన్ని 2 నిమిషాల్లో ఇలా కనిపెట్టండి..

మన దేశంలో మూడు పూటలా అన్నం తినేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని తిన్నా.. అన్నం లేకపోతే కడుపు వెలితిగానే ఉంటుంది. అయితే మీరు తినే అన్నం ఎంత వరకు సేఫ్.. మార్కెట్లో లాభాల కోసం బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలుపుతున్నారనే వాదనలు ఉన్నాయి. మరి మనం తినే బియ్యం అసలైనదేనా కాదా అని కేవలం రెండు నిమిషాల్లో ఇంట్లోనే తెలుసుకోవచ్చు.

అన్నం తింటున్నారా.. ప్లాస్టిక్ తింటున్నారా.. కల్తీ బియ్యాన్ని 2 నిమిషాల్లో ఇలా కనిపెట్టండి..
How To Identify Plastic Rice
Krishna S
|

Updated on: Jul 15, 2026 | 8:25 AM

Share

మన తెలుగు రాష్ట్రాల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా ప్రతిరోజూ మూడు పూటలా అన్నం తినడానికే మెజారిటీ ప్రజలు ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే బియ్యం ఎంతవరకు సురక్షితం? మనం నమ్మి కొంటున్న ఆ బియ్యంలో లాభాల కోసం ప్లాస్టిక్ బియ్యాన్ని కలుపుతున్నారనే వార్తలు ఈ మధ్యకాలంలో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజువారీ భోజనంలో ఇలాంటి కల్తీ ప్లాస్టిక్ బియ్యాన్ని తెలియకుండా తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మార్కెట్ నుండి తెచ్చుకున్న బియ్యం అసలైనదేనా లేక కల్తీదా అని ఇంట్లోనే గుర్తించవచ్చు. ఆ చిట్కాలు తెలుసుకోవడం అందరూ తెలుసుకోవడం ముఖ్యం

నీటి ప్రయోగం

ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో ఒక చెంచా సాధారణ బియ్యం వేయండి. ఆ బియ్యం గింజలు వెంటనే గ్లాసు అడుగు భాగంలోకి మునిగిపోతే అవి నిజమైన బియ్యం. ఒకవేళ ఆ బియ్యం మునగకుండా నీటిపైనే తేలడం ప్రారంభిస్తే.. అది నకిలీ ప్లాస్టిక్ బియ్యం అని గ్రహించాలి.

కాల్చే ప్రయోగం

కొద్దిగా బియ్యాన్ని తీసుకొని అగ్గిపుల్ల లేదా లైటర్‌తో కాల్చి చూడండి. ఒకవేళ బియ్యం కాలుతున్నప్పుడు ప్లాస్టిక్ కాలినట్లు ఘాటైన వాసన వస్తే, ఆ బియ్యం వంద శాతం నకిలీదే అని అర్థం చేసుకోవచ్చు.

వేడి నూనె ప్రయోగం

బాగా కాగుతున్న వేడి నూనెలో కొంచెం బియ్యాన్ని వేయండి. అది నకిలీ బియ్యం అయితే, నూనె వేడికి కరిగిపోయి నూనె ఉపరితలంపై అంటుకుంటుంది లేదా ముద్దగా మారుతుంది. అసలైన బియ్యం నూనెలో కరిగిపోవు.

రంగు – ఆకారం

నకిలీ బియ్యం: ఇవి మితిమీరిన మెరుపుతో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రతి గింజ ఒకే ఆకారంలో, ఒకే సైజులో ఏకరీతిగా కనిపిస్తుంది.

అసలు బియ్యం: ఇవి సాధారణ మెరుపుతో కాస్త మసకగా కనిపిస్తాయి. వీటిపై కొద్దిగా ధూళి ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రతి గింజ ఒకేలా ఉండదు, కొన్ని గింజలు విరిగిపోయి కూడా ఉండవచ్చు.

వండేటప్పుడు వచ్చే మార్పులు

అసలైన బియ్యాన్ని వండినప్పుడు అవి చక్కగా ఉడికి, గింజలు ఉబ్బుతాయి. అంతేకాకుండా అసలైన బియ్యాన్ని కొన్ని రోజులు నీటిలో నానబెడితే సులభంగా మొలకెత్తుతాయి. కానీ నకిలీ బియ్యాన్ని మీరు ఎంత ఎక్కువ సేపు వండినా, అవి సరిగ్గా ఉడకవు, గింజలు ఉబ్బవు, అవి ఎప్పటికీ మొలకెత్తవు.

ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే మార్కెట్ నుండి రేషన్ బియ్యం లేదా సోనా మసూరి లాంటి బియ్యం తెచ్చుకున్నప్పుడు అనుమానం వస్తే వెంటనే ఈ చిన్న చిట్కాలను పాటించి, మీరు తింటున్నది స్వచ్ఛమైన ఆహారమేనని నిర్ధారించుకోండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..