AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి.. పోలీసుల దర్యాప్తులో..

హైదరాబాద్‌లో మరోసారి దారుణ హత్య కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుని కొందరు దుండగులు అతి దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మృతుడిని వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధిలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ గా పోలీసులు గుర్తించారు.

Hyderabad: మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి.. పోలీసుల దర్యాప్తులో..
Madhapur Murder Case
Anand T
|

Updated on: Jul 15, 2026 | 11:11 AM

Share

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన చిన్నపల్లి భాస్కర్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అతి దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాకు చెందిన చిన్నపల్లి భాస్కర్ గతంలో తన స్వగ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని ప్రేమించాడు. అయితే ఇద్దరిది వేరే క్యాస్ట్ అవ్వడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో మూడేళ్ల క్రితం ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లయినప్పటి నుంచి భర్తతో తరచూ గొడవలు రావడంతో సదరు యువతి విడాకులు తీసుకుంది.

అయితే, తన కూతురి విడాకులకు గతంలో ఆమెను ప్రేమించిన చిన్నపల్లి భాస్కరే కారణమని అమ్మాయి తండ్రి రాజు బాస్కర్‌పై కక్ష పెంచుకున్నాడు. గతంలో భాస్కర్‌ను చంపేస్తామని యువతి తండ్రి, కుటుంబ సభ్యులు బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్న ఐదుగురు యువకులు అయ్యప్ప సొసైటీలో భాస్కర్ ఉంటున్న హాస్టల్ వద్దకు వచ్చి..భాస్కర్‌పై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

అయితే ఈ ఘటనపై మృతుడు భాస్కర్ అన్న చిన్నపల్లి మధు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రేమ వ్యవహారం కారణంగా తన తమ్ముడిని రాజు, కుమారస్వామి, నాగరాజు, రాహుల్‌తో పాటు మరొక వ్యక్తి కలిసి హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి అన్న ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

బాధితుడి పోదరుడి తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో వర్ధన్నపేటలో ఉంటున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన తమ్ముడు భాస్కర్‌కు సదరు యువతితో పరిచయం ఏర్పడిందని.. ఈ విషయం తమకు తెలియడంతో భాస్కర్‌ను హైదరాబాద్ పంపించామని తెలిపాడు. అతడు గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోనే చెఫ్‌గా పనిచేస్తున్నాడని.. ఆ తర్వాత ఆ అమ్మాయికి పెళ్లయిందని తెలిపారు. అయితే తమ తమ్ముడితో ఉన్న పాత రిలేషన్ గురించి తెలిసి యువతి భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడని.. ఆ సమయంలోనే వర్ధన్నపేటలో ఒక కేసు కూడా నమోదైందని తెలిపాడు.

విడాకుల తర్వాత కూడా ఆ అమ్మాయే తన తమ్ముడికి మెసేజ్‌లు చేస్తూ వచ్చేదని.. కావాలనే తన తమ్ముడిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించాడు. ఆ యువతిని కానీ, ఆమె చెల్లిని కానీ తన తమ్ముడు ఎలాంటి బెదిరింపులకు గురిచేయలేదని.. ఒకవేళ బెదిరిస్తే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశాడు. అనవసరంగా కక్ష కట్టి తన తమ్ముడిని పొట్టనబెట్టుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us