AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా

పోసాని కృష్ణమురళి.. ఈ పేరు గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా పలు విభాగాల్లో సత్తా చాటారాయన. 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయన ఆపరేషన్ ధుర్యోధన వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా
Posani Krishna Murali
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2026 | 12:33 PM

Share

నటుడు, దర్శకుడు పొసాని కృష్ణ మురళి చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. జైలు జీవితం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. అవినీతి పనులు లేదా మోసాలు చేసి జైలుకు వెళితే తలదించుకుంటానని, అలాంటి తప్పులు తాను చేయలేదని అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. డబ్బు, మద్యం పంచకుండా స్థిరంగా నిలబడ్డ ఏకైక నాయకుడిని తానేనని ఆయన గర్వంగా చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినా, తన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదని ఆయన నొక్కి చెప్పారు.

ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

పొసాని కృష్ణ మురళి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మెంటల్ కృష్ణ చిత్రంలోని నైటీ పాత్ర గురించి కూడా ఆయన  మాట్లాడారు. ఈ పాత్రను మొదట తక్కువ మార్కెట్ విలువ ఉన్న ఒక హీరో కోసం రాశారని, అయితే ఆయన నైటీ ధరించడానికి సంకోచించారని వెల్లడించారు. ఆ తర్వాత ఈ కథను నటుడు శివాజీ( బిగ్ బాస్ ఫేమ్)కి చెప్పినప్పుడు, శివాజీ కథను, నైటీ ధరించే ఆలోచనను బాగా ఇష్టపడ్డారని, ఇది తన క్రేజ్‌ను పెంచుతుందని భావించారని పొసాని తెలిపారు. శివాజీ మంచి నటుడు, కథా పల్స్ తెలిసినవాడు కాబట్టి ఈ పాత్రకు ఆసక్తి చూపారని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్

అయితే, శివాజీ మృదువైన, సన్నటి రూపం ఆ పాత్రకు అవసరమైన భయపెట్టే భావోద్వేగాన్ని తీసుకురాలేకపోవచ్చని నిర్మాతలు, పొసాని సందేహించారట. ఎందుకంటే, శివాజీ చిన్నగా, ముద్దుగా ఉండగా, ఆ పాత్రకు మరింత ఎత్తు, దృఢత్వం అవసరం అని భావించారట. ఈ నేపథ్యంలో, నిర్మాత మోహన్ బట్లపట్ల పొసానిని స్వయంగా ఆ పాత్రను పోషించమని కోరారట. పొసాని తన ఆరు అడుగుల ఎత్తు, గంభీరమైన రూపం నైటీ పాత్రకు మరింత హైప్ ఉంటుందని అంగీకరించి ఆ బాధ్యతను స్వీకరించారట. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి, ఒకే రోజులో పెట్టుబడిని రాబట్టిందని పొసాని సంతోషంగా చెప్పారు. తన తర్వాత అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో చీర కట్టుకోవడం, లారెన్స్ లాంటి వారు ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ, తాను మెంటల్ కృష్ణలో ధరించిన నైటీ పాత్ర మరింత సాహసోపేతమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. చీర కప్పుకోవడానికి అవకాశం ఉంటుందని, కానీ నైటీ ధరించడం మరింత సవాలుతో కూడుకున్నదని, హిజ్రా అని అనుకుంటారేమో అనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆ కథకు, తన పాత్రకు అది సరిపోతుందని భావించి ధైర్యంగా నటించానని, అది తన బెంచ్ మార్క్గా నిలిచిందని పొసాని కృష్ణ మురళి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us