AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CP Sajjanar: వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన

సైబర్ నేరగాళ్లు కేవలం బాధితుల బ్యాంకు ఖాతాలను మాత్రమే ఖాళీ చేయడం లేదని, వారి భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, చివరికి మనశ్శాంతిని కూడా హైజాక్ చేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల వల్ల కలిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటోందంటే, ఆ బాధ నుండి కోలుకోవడానికి బాధితులకు జీవితకాలం కూడా సరిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. దయచేసి యువత సైబర్ ఉచ్చులో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.

CP Sajjanar: వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Cybercrime, Digital Scams
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 10:03 PM

Share

శనివారం నాడు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎస్ఆర్ శ్లోక కన్వెన్షన్‌లో ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావడం అత్యవసరమని, ముఖ్యంగా విద్యావంతులే లక్ష్యంగా నకిలీ సెబీ సర్టిఫికేట్లు చూపిస్తూ స్టాక్ మార్కెట్‌లు ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో రోజుకు సుమారు రూ. 1 కోటి వరకు ప్రజలు ఇలాంటి మోసాల వల్ల నష్టపోతున్నారని గణాంకాలతో సహా వివరించారు సీపీ. బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులను సాకుగా చూపి అపరిచితులు చేసే ట్రేడింగ్ ప్రతిపాదనలను నమ్మవద్దని కోరారు.

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత చిత్రాలను, సమాచారాన్ని పంచుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులు పంపే హానికరమైన ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. ఇటీవల కాలంలో నకిలీ పోలీసుల పేరుతో ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ వీడియో కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామనే అపరిచిత లోన్ యాప్స్ పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు

ఎవరైనా దురదృష్టవశాత్తూ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’లో 1930 నంబర్‌కు కాల్ చేయాలని, తద్వారా పోగొట్టుకున్న సొమ్మును నేరగాళ్ల ఖాతాల్లో ఫ్రీజ్ చేసి వెనక్కి రప్పించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..