బిగ్ బాస్ తర్వాత నా లైఫ్ నరకం.. చచ్చిపోయినా ఎవరూ రారేమో.. 

Rajitha Chanti

Pic credit - Instagram

15 April 2026

బిగ్ బాస్ షో తర్వాత తాను అనుభవించిన లోన్‌లీనెస్‌ జీవితంలో ఒక వ్యక్తిని నమ్మడానికి దారితీసిందని ఇనయా సుల్తానా చెప్పారు. అదే సమయంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఇనయా వెల్లడించారు.

అతను పెళ్లి చేసుకుంటానని చెప్పడం, తన తల్లితో మాట్లాడించడం వంటివి చేసిన తర్వాతే తాను అతన్ని పూర్తిగా నమ్మానని, సోషల్ మీడియాలో తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించానని తెలిపారు.

అయితే, ఆ వ్యక్తి తన పేరు (ఫేమ్), డబ్బును దుర్వినియోగం చేసి తనను మోసం చేశాడని ఇనయా పేర్కొన్నారు. తన సంపాదన మొత్తాన్ని కోల్పోవడమే కాకుండా, 5 లక్షల రూపాయల అప్పుల పాలైనట్లు ఆమె వెల్లడించారు. 

 ఒక సందర్భంలో తన నాలుగు బంగారు గాజులను కూడా అమ్మేసి ఆ వ్యక్తి వ్యాపారం కోసం ఇచ్చానని, కానీ అదంతా కోల్పోయాను అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

చివరగా ఆ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు కూడా 4 లక్షల రూపాయలు ఇచ్చానని ఆమె తెలిపారు. ఆర్థికంగానే కాకుండా, మానసికంగా కూడా ఆ వ్యక్తి తనను హింసించాడని అన్నారు.

షూటింగ్ ఉన్న రోజు కూడా రాత్రి 2 గంటల వరకు గొడవలు పడేవారని, అది ఒక టార్చర్ బిహేవియర్ అని ఇనయా పేర్కొన్నారు. దీంతో తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళానని తెలిపారు.

రోజుల తరబడి నిద్ర పట్టకుండా ఏడ్చానని చెప్పారు. ఒక దశలో తన జీవితం ముగిసిపోవాలని భావించినప్పటికీ, ఆత్మహత్య ప్రయత్నం చేయలేదని, బ్రతకాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

తన తప్పు లేదని, తాను నిజాయితీగా ఉన్నానని, వారి మాటలకు ఎందుకు బాధపడాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను లోన్‌లీనెస్‌ నుండి బయటపడి, తన కెరీర్‌పై దృష్టి సారించానని అన్నారు.