నెగిటివ్ పబ్లిసిటీ.. ఒక్క కేసుతో విష్ణుప్రియకు కలిసొచ్చిన లచ్చిందేవి

Rajitha Chanti

Pic credit - Instagram

15 April 2026

బుల్లితెర యాంకర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ భీమనేని  ప్రస్తుతం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

సాధారణంగా సెలబ్రిటీల చుట్టూ వివాదాలు అల్లుకుంటే వారి ఇమేజ్ దెబ్బతింటుంది. కానీ, విష్ణుప్రియ విషయంలో మాత్రం ఈ వివాదం ఆమె ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసింది.

ఇటీవల విష్ణుప్రియ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని వీడియోలు, ఫోటోలపై అభ్యంతరాలు వ్యక్తమవుతూ, పోలీసులకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే.

 వార్త నెట్టింట వైరల్ కావడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. అయితే, ఈ నెగటివ్ పబ్లిసిటీనే ఆమెకు వరంగా మారింది. ఈ వివాదం తర్వాత ఆమె ఫాలోవర్స్ మరింత పెరిగారు.

విష్ణుప్రియ తన గ్లామరస్ కంటెంట్‌ను వీక్షించేందుకు ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇదివరకే ఆమెపై ఫిర్యాదు ఇచ్చారు. 

తాజా సమాచారం ప్రకారం ఆమెపై పోలీస్ కంప్లైంట్ వచ్చిన తర్వాత, ఆ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందట. ఇదే విషయం ఆమెకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

వివాదం తలెత్తిన కొన్ని రోజుల్లోనే ఆమె రెవెన్యూ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి వెళ్లడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఆమె అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. 

సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా, "నెగటివ్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో పబ్లిసిటీ" అనే మాటను విష్ణుప్రియ ఇష్యూ మరోసారి నిరూపించింది.