AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిత్రాల ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌లోని 20 చిత్రాలలో, అత్యంత చెత్తగా భావించే చిత్రాల గురించి చెప్పుకొచ్చారు.ఆ చిత్రాన్ని చాలా నమ్మకంతో మొదలుపెట్టినా, ఒకరు మోసం వల్ల, ప్రొడక్షన్ కండిషన్స్ వల్ల అది తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు చిత్రాల వైఫల్యానికి తన అసమర్థత, అసహాయతలే కారణమని అంగీకరించారు.

Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..
Krishna Vamsi
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2026 | 10:48 PM

Share

దర్శకుడు కృష్ణవంశీ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, చిత్రాల వెనుక ఉన్న వాస్తవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన 20 చిత్రాలలో కొన్నింటిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా, మొగుడు చిత్రంపై ఆయన తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. మొదట్లో ఈ సినిమాపై ఎంతో ఓపెన్‌గా, నమ్మకంతో ఉన్నానని, అయితే తర్వాత అది “భగవంతుడా ఎప్పుడు అయిపోతుందా” అనిపించేలా మారిందని అన్నారు. ఈ చిత్రం అనుకున్న విధంగా రాకపోవడానికి “కొంతమంది మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఎజెండాలు” కారణమని, అది తన జీవితంలో ఒక “బిట్టర్ చాప్టర్” అని పేర్కొన్నారు. ప్రొడక్షన్ కండిషన్స్ ఒక క్రియేటర్ ఆలోచనలపై 100% ప్రభావం చూపుతాయని, స్టోరీ లైన్, మేకింగ్‌ను కూడా మారుస్తాయని ఆయన చెప్పారు. “ఒకడి మోసం వల్ల ఆ సినిమా ఒప్పుకోవాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది” అని మొగుడు అనుభవాన్ని వివరించారు. ఆ ఎనిమిది-పది నెలల ప్రొడక్షన్ తనకు చాలా చెడ్డ అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

తన 20 సినిమాలలో అత్యంత “చెత్త”విగా మొగుడు, పైసా చిత్రాలను పేర్కొన్నారు. ఈ రెండు చిత్రాల వైఫల్యానికి పూర్తిగా తానే కారణమని, “నా ఫెయిల్యూర్, నా అసహాయత, నా అసమర్థత, నా పరాజయం” అని కృష్ణవంశీ అంగీకరించారు. అయితే, తన ఉత్తమ చిత్రాల గురించి మాట్లాడుతూ, చందమామకు టాప్ పొజిషన్ ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

చందమామతో పాటు మురారి, అంతఃపురం, ఖడ్గం, డేంజర్ చిత్రాలను తన ప్రౌడ్ వర్క్స్‌లో చేర్చారు. డేంజర్ చిత్రంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సినిమాలో రొమాన్స్ పాటలు, టిపికల్ కామెడీలు లేవని, అయినా కేవలం 80 లక్షల బడ్జెట్‌లో ఆ చిత్రాన్ని తీసి, దాని అవుట్‌పుట్‌తో తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఆ బడ్జెట్‌కు, ఆ సెటప్‌కు అది చాలా మంచి చిత్రమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..