AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: హోటల్‌లో మంచు లక్ష్మికి చేదు అనుభవం.. వీడియో షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ నటి

టాలీవుడ్ ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మికి చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్విట్టర్ లో ఒక వీడియోను షేర్ చేస్తూ హోటల్ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది.

Manchu Lakshmi: హోటల్‌లో మంచు లక్ష్మికి చేదు అనుభవం.. వీడియో షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ నటి
Manchu Lakshmi
Basha Shek
|

Updated on: Feb 07, 2026 | 10:19 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటి ఇప్పుడు పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. టీవీ షోలోనూ పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఎక్కవగా ముంబైలోనే ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు మాత్రమ హైదరాబాద్ కు వస్తోంది. ఈ క్రమంలో తాజాగా చెన్నైకు వెళ్లిన మంచు లక్ష్మికి అక్కడి ఓ హోట‌ల్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని స్వయంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) లో ఒక వీడియోను షేర్ చేసిన మంచు లక్ష్మి.. అందులో ఇలా చెప్పుకొచ్చింది. ‘ చెన్నైలోని గ్రీన్ పార్క్ హోట‌ల్ లో ఎదురైన అనుభ‌వంతో నేను పూర్తిగా నిరాశ చెందాను. నేను ప్ర‌పంచం లో ఎన్నో ప్లేస్ లకు వెళ్లాను. ఎక్కడా ఇలాంటి రూల్స్ చూడలేదు. హోట‌ల్ లోకి కనీసం నా కెమెరా మెన్ ను కూడా అనుమ‌తించ‌లేదు. ఇక్కడ కెమెరాల‌కు హోటల్ రూంలోకి అనుమ‌తించ‌మన్నారు. అయితే కెమెరాల‌ను అనుమ‌తించం అని నాకు ఎక్క‌డా ప్ర‌క‌ట‌న‌లు కూడా కనిపించ‌లేదు. ఇక్కడి మేనేజ‌ర్ ప్ర‌వ‌ర్త‌న కూడా దురుసుగా ఉంది. సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న సైతం అలాగే ఉంది.

నేను అడిగిన ఏ ప్రశ్నకు కూడా హోటల్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే ఇది వ‌ర‌కు నేను ఇదే హోట‌ల్ లో దిగిన ఫోటోలు చూపించ‌డంతో అనుమతించారు. ఇది అతిథుల‌ను గౌర‌వించే విధానం కాదు. గ్రీన్ పార్క్ హోట‌ల్స్ అంటే నాకు ఎంతో అభిమానం. కానీ నాకు ఇక్క‌డే ఇలాంటి అనుభ‌వం ఎదురైంది. దీనిపై యాజ‌మాన్యం స్పందించి మ‌ళ్లీ ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూడాలి’ అని కోరింది మంచు లక్ష్మ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మంచు లక్ష్మి షేర్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర