AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూటిపోటి మాటలతో ఎగతాళి చేసి, దాడికి పాల్పడ్డ తోటి విద్యార్థులు.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!

ఉత్తరప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఘాజీపూర్‌లో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తెలివైన విద్యార్థిని, చదువుల్లోనూ చురుకుగా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా చేసేది. అయితే పాఠశాలలో ఇద్దరు బాలికలు ఆమెను ఎగతాళి చేశారు.

సూటిపోటి మాటలతో ఎగతాళి చేసి, దాడికి పాల్పడ్డ తోటి విద్యార్థులు.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!
Minor Girl Suicide
Balaraju Goud
|

Updated on: Feb 07, 2026 | 10:18 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఘాజీపూర్‌లో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తెలివైన విద్యార్థిని, చదువుల్లోనూ చురుకుగా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా చేసేది. అయితే పాఠశాలలో ఇద్దరు బాలికలు ఆమెను ఎగతాళి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని తన ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ సంఘటన మొహమ్మదాబాద్ కొత్వాలి ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగింది. అక్కడ 16 ఏళ్ల అంజలి (పేరు మార్చడం జరిగింది) ఆత్మహత్య చేసుకుంది. కొన్ని నెలలుగా, ఆమె పొరుగున ఉన్న ఇద్దరు బాలికలు ఇతరుల ఇళ్లలో పని చేస్తున్నందుకు, ఆమె పేదరికాన్ని పదేపదే అవమానించారు. వారు అంజలిని ప్రతిరోజు ఎగతాళి చేసేవారు. ఫిబ్రవరి 4న, ఆమె పాఠశాలకు వచ్చినప్పుడు, ఇద్దరు బాలికలు మళ్ళీ ఆమెను అవమానించి, దాడి చేశారు.

ఆ తరువాత, ఇద్దరు బాలికలు అంజతిపై పాఠశాల ఉపాధ్యాయుడికి తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆమె చెప్పేదీ వినకుండా ఆ ఉపాధ్యాయుడు అంజలిని చాలాసార్లు చెంపదెబ్బ కొట్టాడు. దీంతో మనస్తానికి గురైంది విద్యార్థిని. ఉపాధ్యాయుడు కొట్టడం, విద్యార్థుల మాటలు అంజలి మానసిక ఒత్తిడికి కారణమయ్యాయి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, విద్యార్థి పురుగుమందు తాగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆమె తల్లి పొలాలకు వెళ్ళింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి వెళ్లి విద్యార్థినిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.

ఈ సంఘటన తర్వాత, విద్యార్థి తండ్రి తన కుమార్తె మరణానికి పాఠశాల ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులను బాధ్యులుగా అభియోగం మోపాడు. అతను మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ముగ్గురిపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఉపాధ్యాయుడు ఇంతకు ముందు ఎటువంటి కారణం లేకుండా అనేక మంది విద్యార్థులను కొట్టాడని ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన ఉపాధ్యాయుడిపై డయల్-112లో కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..