AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఫస్ట్‌ నైట్‌ రోజు భర్తకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భార్య.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే..

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లయిన మొదటి రాత్రే వధువు తన భర్తకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఫస్ట్‌ నైట్‌ రోజు రాత్రి గదిలోకి వచ్చిన భర్తకు పెళ్లి కూతురు ఒక కండీషన్ పెట్టింది. తనను ముట్టుకోవాలి అంటే రూ.90లక్షల ఇవ్వాలని చెప్పింది. అది విన్న పెళ్లి కొడుకు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇందుకు సంబంధించిన స్టోరీ ప్రస్తుతం సోసల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Viral News: ఫస్ట్‌ నైట్‌ రోజు భర్తకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భార్య.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే..
First Night Shock
Anand T
|

Updated on: Apr 15, 2026 | 9:30 PM

Share

తనను ముట్టుకోవాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని ఫస్ట్‌నైట్‌ రోజు భర్తను పెళ్లి కూతురు డిమాండ్ చేసిన ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జగదీష్‌పురకు చెందిన యువకుడికి, హత్రాస్ ప్రాంతానికి చెందిన యువతితో ఇటీవలే ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగియగానే ఫస్ట్‌నైట్‌కు రెడీ చేశారు కుటుంబ సభ్యులు. ఇక ఆత్రుతగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన పెళ్లి కొడుకు వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనను ముట్టుకోవాలంటే తను రూ. 90 లక్షలు ఇవ్వాలి షరతు పెట్టింది. అది విన్న పెళ్లి కొడుకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంత డబ్బు ఇవ్వడం సాధ్యం కాదని, అసలు డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లి కూతురు వరుడితో గొడవకు దిగింది. గదిలోంచి గొడవ పడుతున్న శబ్ధాలు రావడంతో కుటుంబ సభ్యులంతా అక్కడి చేరుకున్నారు. దీంతో జరిగిన విషయాన్ని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.వారంతా ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె అస్సలు తగ్గలేదు. పైగా తన పుట్టింటి వారికి ఫోన్ చేసి, వరుడి కుటుంబ సభ్యులపై దాడి చేయమని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఫిర్యాదులో వరుడి కుటుంబ సభ్యులు ఇలా పేర్కొన్నారు.. ఆమె భర్తను, అతని కుటుంబ సభ్యులను గదిలో వేసి లాక్ చేసిందని, తర్వాత గ్యాస్ సిలిండర్ పైపును తొలగించి అందరినీ చంపేయడానికి కూడా ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే మొదట్లో కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో వరుడి కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో ఘటనపై విచారణ జరిపిన కోర్టు ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పెళ్లి కూతురికి మొత్తం నిజాలు బయటపెట్టింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కేవలం డబ్బు కోసమే వివాహానికి ఒప్పుకున్నానని ఆమె నిర్మొహమాటంగా అంగీకరించింది. దీంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులకు అదుపులోకి తీసుకొని మరింత సమాచారం రాబడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పచ్చిమిర్చి చికెన్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
పచ్చిమిర్చి చికెన్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం
మెచ్యూర్ కానీ అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి..
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి..
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?