AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!

హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!
Hanamkonda Crime
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 02, 2026 | 8:24 AM

Share

హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

హనుమకొండ నగరంలోని 4వ డివిజన్ కృష్ణకాలనీలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. అనిల్ కుమార్, రజిత ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనిల్ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిల్ కుమార్.. భార్య రజితపై అమానుషంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఆమె కాళ్లు, చేతులు కట్టేసి, అనంతరం గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఘటన అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అనిల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు దారితీసిన అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనతో కృష్ణకాలనీ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు ఇంతటి ఘోరానికి దారితీయడం స్థానికులను కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, నిందితుడి విచారణ ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us