AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ‘మా నాన్న బైక్‌ అక్కడ దాచాడు’.. పోలీసుల కార్డన్ సెర్చ్‌లో తండ్రిని పట్టించిన బుడ్డోడు

నాన్న చేసిన పని తప్పని భావించిన ఓ ఆరేళ్ల బాలుడు.. ఏ మాత్రం భయపడకుండా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పాడు. అంతేకాదు, తన తండ్రి బైక్‌ను ఎక్కడ దాచాడో పోలీసులకు స్వయంగా చూపించాడు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగిన ఈ ఘటన పోలీసులతో పాటు స్థానికులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతసాగరంలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేయడంతో పాటు ఇళ్లలో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు..

Watch: ‘మా నాన్న బైక్‌ అక్కడ దాచాడు’.. పోలీసుల కార్డన్ సెర్చ్‌లో తండ్రిని పట్టించిన బుడ్డోడు
Boy Tells Police His Father Hid The Bike
Ch Murali
| Edited By: |

Updated on: Aug 21, 2026 | 10:08 AM

Share

నెల్లూరు, ఆగస్ట్ 21: శత్రువులు ఎక్కడో ఉండరు.. తమ్ముళ్లు, కూతుర్లు, చెల్లెళ్ల రూపంలో మన చుట్టూ తిరుగుతుంటారు అనే ఓ సినిమా డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదూ.. అయితే సినిమా డైలాగ్ అటుంచితే కన్న తండ్రి కన్నా తనకు నిజాయితి మాత్రమే ముఖ్యమని  నిరూపించుకున్నాడు ఓ కొడుకు.. అయితే ఆ నిజాయితి నిరూపించుకున్న కొడుకు వయస్సు కేవలం 6 ఏళ్ళు మాత్రమే. ఇంతకీ ఆ తండ్రి చేసిన పనేంటి? ఈ ఆరేళ్ల కొడుకు చూపించుకున్న నిజాయితి ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

నెల్లూరు జిల్లా ఆనంతసాగరం లో పోలీసులు సాధారణ తనికీల్లో భాగంగా కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్డెన్ సర్చ్ లో భాగంగా ప్రతి ఇంటిని ఇంట్లోని వాహనాలను తనిఖీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఐతే పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో సురేష్ అనే వ్యక్తి బైక్ కి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడమో లేదా మరేదైనా కారణమో తెలియదు కానీ సురేష్ తన బైక్ ను ఇంటికి దూరంగా మరో వీధిలోకి తీసుకువెళ్లి పెట్టాడు. అయితే పోలీసులు వాహనాలను తనికీ చేయడం మొదట నుంచి చూస్తున్న సురేష్ కొడుకు ఆరేళ్ళ వయసున్న మహేంద్ర తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టడాన్ని గుర్తించాడు. దీంతో కార్డెన్ సర్చ్ చేస్తున్న పోలీసుల వద్దకి వెళ్లి తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టాడని చెప్పడమేకాకుండా.. వారిని వెంటబెట్టుకునిమరీ తన తండ్రి దాచిన బైక్ ను పోలీసులకు చూపించాడు.

ఇవి కూడా చదవండి

అయితే చిన్నారి పోలీసుల వద్దకు వెళ్లి మీరు వస్తున్నారని మా నాన్న బైక్ వేరే దగ్గరదాచి పెట్టాడని, అక్కడికి రావాలని చెప్పడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కుటుంబ సభ్యులు చేస్తున్న చిన్న చిన్న పొరపాటులకే అబద్దాలు చెప్పి వారిని కాపాడుకుంటున్న ఈ రోజుల్లో.. తన తండ్రి చేసిన తప్పును ధైర్యగా పోలీసుల వద్దకు వెళ్లి చెప్పిన మహీంద్రాని శభాష్ అనాల్సిందే మరి. అయితే పోలీసులు తనికీల్లో సురేష్ బైక్ కి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తండ్రిని కాపాడేందుకు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పిన మహేంద్రను స్థానికులు అభినందిస్తున్నారు. చిన్న వయసులోనే నిజాయితీగా వ్యవహరించిన బాలుడిని ‘శభాష్‌ మహేంద్ర’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన ద్వారా చిన్నారుల్లో నిజాయితీ, ధైర్యం, తప్పు చేస్తే దాన్ని దాచకుండా నిజం చెప్పాలనే విలువలు ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది.

Follow Us