AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు.. వరల్డ్‌కప్ టికెట్ల కోసం ఎగబడుతన్న ఫ్యాన్స్..

క్రికెట్ ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. అభిమానుల్లో అప్పుడే వరల్డ్‌కప్ ఫీవర్ పీక్స్‌కు చేరింది.. వచ్చే ఏడాది జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ టికెట్ బ్యాలెట్ ఓపెన్ చేసిన కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 1.5 కోట్లకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో జరిగే టీమిండియా తొలి మ్యాచ్‌తో పాటు భారత్-పాక్ సమరానికి టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.

మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు.. వరల్డ్‌కప్ టికెట్ల కోసం ఎగబడుతన్న ఫ్యాన్స్..
2027 Odi World Cup Ticket Ballot
Krishna S
|

Updated on: Oct 13, 2026 | 9:00 PM

Share

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ వన్డే ప్రపంచకప్‌ 2027 టికెట్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్ బ్యాలెట్ ఓపెన్ చేసిన కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 1.5 కోట్లకు పైగా అప్లికేషన్స్ వచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ధ్రువీకరించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 14వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్‌ పట్ల అభిమానుల్లో ఎంతటి ఉత్సాహం ఉందో ఈ దరఖాస్తుల వరద చాటిచెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల నుంచి దాదాపు 44.23 లక్షల మంది అభిమానులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, మొత్తం 1,50,83,752 టికెట్ అప్లికేషన్లు దాఖలైనట్లు ఐసీసీ వెల్లడించింది.

అసలేంటీ వరల్డ్‌కప్ టికెట్ బ్యాలెట్ విధానం?

అధిక డిమాండ్ ఉన్న మెగా మ్యాచ్‌లకు టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఐసీసీ లాటరీ ఆధారిత బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తోంది. అభిమానులు తాము చూడాలనుకున్న నిర్దిష్ట మ్యాచ్‌లకు ఈ బ్యాలెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి ఒక మ్యాచ్‌కు ఒక్క బ్యాలెట్ ఎంట్రీ మాత్రమే వేయగలరు. అయితే టోర్నమెంట్‌లోని పలు వేర్వేరు మ్యాచ్‌లకు ఎంట్రీలు సమర్పించే వెసులుబాటు ఉంది. అందుబాటులో ఉన్న టికెట్ల సంఖ్య కంటే డిమాండ్ ఎక్కువ ఉన్న మ్యాచ్‌లకు రాండమైజ్డ్ బ్యాలెట్ పద్ధతి ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన దరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ లింక్ ఉపయోగించి వారు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్ 21, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

అక్టోబర్ 7న భారత్ తొలి సమరం.. ఆసీస్‌తో రీమ్యాచ్..

వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రారంభమై నవంబర్ 21 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు తలపడనున్నాయి. వీటిని ఆరు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ -ఎ: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్, క్వాలిఫైయర్ -ఎ

గ్రూప్ – బి: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫైయర్- బి

టీమిండియా తన ప్రపంచకప్‌ వేటను అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుండటం విశేషం. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండటంతో ఈ పోరుపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ కోసం కూడా అభిమానులు రికార్డు స్థాయిలో టికెట్లకు పోటీ పడుతున్నారు.

Follow Us
కొత్త ఏడాది నుంచి రైల్వేలో భారీ మార్పులు.. ఈ రైళ్లలో డబ్బులు ఆదా
కొత్త ఏడాది నుంచి రైల్వేలో భారీ మార్పులు.. ఈ రైళ్లలో డబ్బులు ఆదా
వాచ్ పోగొట్టుకున్న కింగ్ కోహ్లీ.. అంపైర్ చేసిన పనికి ఫిదా..!
వాచ్ పోగొట్టుకున్న కింగ్ కోహ్లీ.. అంపైర్ చేసిన పనికి ఫిదా..!
Videos: చెత్తబుట్టలో ట్రంప్.. AI మీమ్స్‌తో నెటిజన్ల సెటైర్లు!
Videos: చెత్తబుట్టలో ట్రంప్.. AI మీమ్స్‌తో నెటిజన్ల సెటైర్లు!
అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి
అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? గోవా కాలేజీలో ఈ కోర్సు చదవండి!
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? గోవా కాలేజీలో ఈ కోర్సు చదవండి!
భార్యతో విడాకులపై స్పందించిన టాలీవుడ్ విలన్..
భార్యతో విడాకులపై స్పందించిన టాలీవుడ్ విలన్..
గుడ్‌న్యూస్ హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు
గుడ్‌న్యూస్ హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు
టాలీవుడ్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. కడిగి పారేసిన పాయల్..
టాలీవుడ్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. కడిగి పారేసిన పాయల్..
భారత క్రికెట్ రూపురేఖలే మార్చేసిన కోహ్లీ దూకుడు..!
భారత క్రికెట్ రూపురేఖలే మార్చేసిన కోహ్లీ దూకుడు..!
ఆ సినిమా ఛాన్స్ ముందు నాకే వచ్చింది.. కానీ మిస్ చేసుకున్నా.!
ఆ సినిమా ఛాన్స్ ముందు నాకే వచ్చింది.. కానీ మిస్ చేసుకున్నా.!