AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. తెలుగు గంగ నీటి విడుదల చర్చ..

తెలుగు గంగ నీటి విడుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భేటీ అయ్యారు. ఎల్నినో ప్రభావంతో స్థానికంగా నీటి నిల్వలు పడిపోవడంతో సెప్టెంబర్ 10 నుంచి నిలిచిపోయిన కృష్ణా జలాల సరఫరాను తిరిగి ప్రారంభించాలని విజయ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. నీటి లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఏపీ స్పష్టం చేయగా.. మరోవైపు గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. తెలుగు గంగ నీటి విడుదల చర్చ..
Tamil Nadu Cm Vijay Meets Ap Cm Chandrababu Naidu
Krishna S
|

Updated on: Oct 13, 2026 | 6:48 PM

Share

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీలో పర్యటించారు. సీఎం చంద్రబాబుతో నాయుడుతో ఆయన సమావేశమయ్యారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి నీటి విడుదల పునరుద్ధరించాలని, అలాగే దక్షిణ భారతదేశ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారమైన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. చెన్నై నగర తాగునీటి దాహార్తిని తీర్చే కండలేరు రిజర్వాయర్ నుంచి తెలుగు గంగ నీటి సరఫరాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సెప్టెంబర్ 10వ తేదీ నుంచి నిలిపివేసింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో జలాశయాల నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దీంతో స్థానిక తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి నీటి విడుదలను తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది.

ఈ ఏడాది ఇప్పటివరకు తమిళనాడుకు ఏపీ 4.08 టీఎంసీల నీటిని అందించింది. ఒప్పందం ప్రకారం జనవరి-ఏప్రిల్ మధ్య 4 టీఎంసీలు, జూలై-అక్టోబర్ మధ్య 8 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి సరఫరాలో తీవ్ర లోటు ఏర్పడింది. చెన్నైలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చడంతో తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా ఏపీకి వచ్చి సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. ప్రస్తుత నిల్వలను పరిగణనలోకి తీసుకుని, మానవతా దృక్పథంతో చెన్నైకి నీటి విడుదలను పునరుద్ధరించాలని విజయ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఏపీలో ఉన్న ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

గోదావరి-కావేరి అనుసంధానంపై ముమ్మర మంతనాలు

తాత్కాలిక నీటి సమస్యలతో పాటు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నదుల అనుసంధానంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోతుగా చర్చించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులను అనుసంధానిస్తే దక్షిణ భారతదేశ ముఖచిత్రమే మారిపోతుందని సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రతించారు. ఈ ప్రతిపాదనను బలపరిచిన సీఎం విజయ్.. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుతో పాటు అన్ని దక్షిణాది రాష్ట్రాలకు నీటి భద్రత లభిస్తుందన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులు, బడ్జెట్ నిధుల కేటాయింపులను వేగవంతం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై సంయుక్తంగా ఒత్తిడి తేవాలని, ఈ విషయంలో ఇప్పటికే తాను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు విజయ్ వెల్లడించారు.

దుర్గమ్మ దర్శనం.. పోటెత్తిన అభిమానులు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఏపీ గడ్డపై అడుగుపెట్టిన సీఎం విజయ్‌కు విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను విజయ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమిళనాడు ప్రజల కష్టాలు తీరాలని, చెన్నై దాహార్తి తీరాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

Follow Us