AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణంలోనూ వీడని స్నేహం.. తామర పువ్వుల కోసం వెళ్లి చెరువులో చిన్నారుల బలి

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో దసరా సెలవుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊర చెరువులో తామర పువ్వులు కోయడానికి వెళ్లిన ఆరో తరగతి విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. మంచి స్నేహితులైన వీరిద్దరూ చెరువు లోతు తెలియక నీళ్లలో దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పిల్లల మృతితో రెండు పేద కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. సెలవులంటేనే తల్లిదండ్రులు వణికిపోయేలా చేసిన ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. గ్రామాల్లోని చెరువుల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరణంలోనూ వీడని స్నేహం.. తామర పువ్వుల కోసం వెళ్లి చెరువులో చిన్నారుల బలి
Lotus Flower Traged
Fairoz Baig
| Edited By: |

Updated on: Oct 13, 2026 | 6:28 PM

Share

దసరా సెలవులంటే చిన్నారులకు ఆట విడుపు… అయితే విధి మాత్రం ఆ విద్యార్థులకు జీవితకాలం సెలవు ఇప్పించేసింది… . తామర పువ్వుల కోసమని చెరువు నీళ్లలో దిగి ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృత్యువాత పడిన ఘటన ప్రకాశంజిల్లా నాగులుప్పల పాడు మండలం ఉప్పుగుండూరులో చోటు చేసుకుంది… పేద కుటుంబాల్లో కడుపు కోత మిగిల్చింది.

రెక్కాడితే డొక్కాడని రెండు కుటుంబాల్లోని ఇద్దరు పిల్లలు చదువుకొని మంచి పౌరులుగా ఎదిగి కుటుంబాలకు ఆసరాగా ఉంటారని భావించిన తల్లిదండ్రులకు నిరాశే మిగిల్చారు… వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వారైనా స్నేహమంటే ప్రాణం పెడతారు… వీరిద్దరూ ఆటపాటలతో పాటుగా చదువుల్లో కూడా చురుగ్గా ఉండేవారు… ప్రకాశంజిల్లా ఉప్పుగుండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొలకలూరి నిషిత్ బాబు(12), కండ్లగుంట నాగచైతన్య(11) ఆరవ తరగతి చదువుతున్నారు ఈ ఇద్దరు విద్యార్థులు ఆరవతరగతి చదువుతున్నారు… మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు విద్యార్ధులు దసరా సెలవులు కావడంతో గ్రామంలోని ఊర చెరువు దక్షిణం వైపు ఆటలాడుకుంటూ వెళ్ళారు. అక్కడ చెరువులో తామర పువ్వులను చూసి ముచ్చటపడ్డారు… వాటిని కోసుకునేందుకు చెరువులోకి దిగారు…

చెరువులోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఊపిరాడక చనిపోయారు… చెరువు లోతు అర్థం కాక పోవడంతో ఒక్కసారిగా దిగిన వెంటనే నీళ్లు లోతుగా ఉండటంతో పూలు కోసుకుంటూ నీటలో మునిగిపోయారు… బయటకు రాలేక నీటిలోనే తుది శ్వాస విడిచారు… అనంతరం అటుగా వెళుతున్న కొంతమంది చెరువు గట్టుపై చెప్పులు ఉండటాన్ని గమనించి చెరువులో గమనించారు… ఆ సమయంలో కొన ఊపిరితో నీట మునుగుతూ కనిపించేసరికి కేకలు వేసి చుట్టుపక్కల వారిని రప్పించారు… చెరువులోకి దిగి ఇద్దరు విద్యార్ధులను బయటకి తీసేసరికి అప్పటికే ఇరువురు మృత్యువాత గురయ్యారు…

ఇవి కూడా చదవండి

ఇంటిదగ్గర సెలవు రోజుల్లో ఆటలు ఆడుకునేందుకని చెప్పి వెళ్లిన వారు చెరువులో పడి మృత్యువాతకు గురయ్యారని ఆ కుటుంబాలకు తెలియడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు… దసరా సెలవులు తమ చిన్నారుల పాలిట శాశ్వత సెలవులుగా మారాయని ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు… మృత్యువాతకు గురైన బాలుర దేహాలపైన పడి వారు కన్నీరు మున్నీరుగా విలపించడంతో వారిని ఆపడం ఎవరి తరం కాలేదు… ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు జిల్లాలో పదేపదే జరుగుతున్నప్పటికీ కూడా గ్రామాల్లోని ఊరు చెరువులో చుట్టు పెన్సింగ్ వేసి భద్రత చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు… ఇకనైనా ప్రభుత్వం, పంచాయతీ పెద్దలు గ్రామాల్లోని ఊరు చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us