అనుపమ పరమేశ్వరన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? రెమ్యునరేషన్ ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
20 August 2026
తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ కేరళ కుట్టి.
తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో ‘అ ఆ’ చిత్రంతో అరంగేట్రం చేసిన అనుపమ, ఆ తర్వాత వరుసగా హిట్లు అందుకుంది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇటీవల ‘కిష్కింధపురి’, ‘పరదా’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
సినీ పరిశ్రమలో కథానాయికగా మంచి విజయాన్ని అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆస్తుల విలువకు సంబంధించి సోషల్ మీడియాలోనూ, నెట్టింటా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కథనాల ప్రకారం, ప్రస్తుతం ఆమె మొత్తం ఆస్తుల నికర విలువ సుమారు రూ. 50 కోట్లు వరకు ఉంటుందని అంచనా. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
ప్రతీ సినిమాకు గణనీయమైన మొత్తంలోనే పారితోషికం అందుకుంటోంది. సమాచారం ప్రకారం ఆమె ఒక్కో సినిమాకు రూ. 1 కోటి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రైవేట్ ఈవెంట్లు మరియు సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా కూడా ఆమె భారీగానే ఆర్జిస్తోంది. అటు నెట్టింట చాలా యాక్టివ్ ఈ అమ్మడు.
వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే అనుపమ, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా బ్రేకప్ విషయం బయటపెట్టింది.