AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఇంటి కోసం మీ పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులే..

ఇంటి అవసరాల కోసం పీఎఫ్ బ్యాలెన్స్ చాలామంది విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేసుకోవడం మంచిదా...? కాదా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. పీఎఫ్ నగదు ముందే విత్ డ్రా చేసుకోవడం వల్ల భవిష్యత్తుల్లో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినప్పుడు నిధులు ఉండవ్.

EPFO: ఇంటి కోసం మీ పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Aug 21, 2026 | 9:17 AM

Share

చాలామంది తమ ఆర్ధిక అవసరాల కోసం పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునేందుకు కారణాలను చూపించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. విద్య, మ్యారేజ్, ఇంటి నిర్మాణం వంటి కేటగిరీలు ఎంచుకుని పీఎఫ్ నగదు ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం లక్షల్లో డబ్బులు ఖర్చవుతాయి. ఇందుకోసం కూడబెట్టుకున్న పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం కోసం పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకోవడం మంచిదా..? కాదా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా..?

హోమ్ లోన్ తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆస్తులన్నీ తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అదీ కాక వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో పీఎఫ్ డబ్బులను ఎక్కువమంది విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం, ఈఎంఐ చెల్లించేందుకు పీఎఫ్ నగదు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 1952(ఈపీఎఫ్ పథకం)లోని సెక్షన్ 68బీ ప్రకారం నిర్దిష్ట షరతులకు లోబడి ఇంటి నిర్మాణం, ఇల్లు కొనుగోలు, హోస్ లోన్ పేమెంట్ కోసం పీఎఫ్ నగదు పాక్షికంగా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. మీ పీఎఫ్ నిల్వలో 90 శాతాన్ని ఈ విధానంలో తీసుకోవచ్చు. అయితే ఇల్లు మీ పేరు మీద లేదా మీ జీవిత భాగస్వామి లేదా ఇద్దరి పేర్లపై ఉంటే మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. మీరు విడతల వారీగా కూడా నగదును తీసుకోవచ్చు

మంచిదా..? కాదా?

ఇంటి నిర్మాణం ఆరు నెలల్లోపు పూర్తి కావాలి. అయితే పీఎఫ్ నగదును తీసుకోవడం వల్ల మీ రుణం, ఈఎంఐను తగ్గించుకోవచ్చు. హోం లోన్ ప్రాసెస్ అవ్వడానికి చాలా రోజుల సమయం పడుతుంది. అదే పీఎఫ్ నగదు మూడు రోజుల్లోనే అకౌంట్లో జమ అవుతుంది. దీంతో ఇల్లు త్వరగా కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే హోం లోన్ తీసుకోవాలంటే మీ ఆస్తులను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. పీఎఫ్ నగదును తీసుకోవడం వల్ల మీ ఆస్తులు భద్రంగా ఉంటాయి. ఆస్తి విలువ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. పీఎఫ్ మొత్తంపై పొందే రాబడితో చూస్తే ఆస్తి ధర ఎక్కువగా ఉంటే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఇక నష్టాల విషయానికొస్తే.. పీఎఫ్ నగదును ముందే విత్ డ్రా చేసుకోవడం వల్ల మీ పదవీ విరమణ నిధి తగ్గిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు డబ్బులు అత్యవసరమైతే అవసరానికి ఏమీ ఉండవు.

Follow Us
ఇంటి బాల్కనీ, టెర్రస్‌, గోడల్లో పెరిగే రావి చెట్టును వేళ్లతో సహా
ఇంటి బాల్కనీ, టెర్రస్‌, గోడల్లో పెరిగే రావి చెట్టును వేళ్లతో సహా
"తీవ్రవాదులమా?"వీసాలున్నాభారత్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పాక్
ఇంట్లో తులసి మొక్క పక్కనే వీటిని పెంచితే ఇబ్బందులు రావచ్చట!
ఇంట్లో తులసి మొక్క పక్కనే వీటిని పెంచితే ఇబ్బందులు రావచ్చట!
ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్లు
ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్లు
అసిడిటీ ఉందా?.. రాత్రిళ్లు ఇలా పడుకుంటే సమస్య పరార్!
అసిడిటీ ఉందా?.. రాత్రిళ్లు ఇలా పడుకుంటే సమస్య పరార్!
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?