Video: ఇలా ఎలా బ్రో.. ఈజీ రనౌట్ మిస్ చేసిన బౌలర్.. చివరకు ఏం జరిగిందంటే?
Sikandar Raza Missed Run Out: షార్జా వారియర్జ్, దుబాయ్ క్యాపిటల్స్ మధ్య జరిగిన ILT20 2026 మ్యాచ్‌లో సికిందర్ రజా ఘోర తప్పిదం చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ రనౌట్ ఛాన్స్‌ను మిస్ చేసి బ్రెయిన్ ఫేడ్ మూమెంట్‌తో వైరల్ అయ్యాడు.

Sikandar Raza Viral Video: షార్జా వారియర్జ్, దుబాయ్ క్యాపిటల్స్ మధ్య జరిగిన ILT20 2026 మ్యాచ్‌లో ఊహించని సంఘటన జరిగింది. వారియర్జ్ కెప్టెన్ సికిందర్ రజా ఈజీ రనౌట్ ఛాన్స్‌ను మిస్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
7వ ఓవర్‌లో ఏం జరిగిందంటే..?
దుబాయ్ ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ కోసం పోరాడుతోంది. పవర్‌ప్లేలో 30-ఒక్క పరుగులతో 1 వికెట్ కోల్పోయింది. పవర్‌ప్లే ముగియగానే కెప్టెన్ సికిందర్ రజా బౌలింగ్‌కు వచ్చాడు. 7వ ఓవర్ మూడో బంతిని మ్యాక్స్ హోల్డెన్ కవర్స్ వైపు ఆడాడు. ఫీల్డర్ వెంటనే బంతిని ఆపి బౌలర్ ఎండ్ వైపు త్రో విసిరాడు.
ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్.. అదేంటంటే?
అవతలి ఎండ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ క్రీజు బయట ఉన్నాడు. రజాకు రనౌట్ చేసే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. కానీ రజా వెనక్కి తిరిగి పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. బంతిని అందుకునే క్రమంలో తడబడటంతో ఫాఫ్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో మ్యాక్స్ హోల్డెన్ తీవ్రంగా డైవ్ చేయడంతో భుజానికి గాయమైనట్లు కనిపించింది.
లైఫ్ వచ్చినా ఫాఫ్ విఫలం.. రజా రివేంజ్..!
అదృష్టం కొద్దీ లైఫ్ వచ్చినా ఫాఫ్ డుప్లెసిస్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వెంటనే ఔట్ అయ్యాడు. సికిందర్ రజానే అతడిని 19 బంతుల్లో 15 పరుగులకే పెవిలియన్ పంపి రివేంజ్ తీర్చుకున్నాడు.
126కే దుబాయ్ ఆలౌట్.. షార్జాకు ఘన విజయం..
Surely gone, surely gone, surely gone… Oh no, Sikandar. 🫣
#DPWorldILT20 #SWvDC #AllInForCricket #WhereTheWorldPlays https://t.co/EoL7nH7NAq
— International League T20 (@ILT20Official) November 27, 2026
రజాతో పాటు జునైద్ సిద్ధిఖీ 3 వికెట్లతో చెలరేగగా.. ఆడమ్ మిల్నే, రిచర్డ్ గ్లీసన్ చెరో 2 వికెట్లు తీయడంతో దుబాయ్ క్యాపిటల్స్ 126 పరుగులకే కుప్పకూలింది.
ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?
ఛేదనలో షార్జా ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, పాల్ వాల్టర్ చెరో 40 పరుగులు చేసి 7 ఓవర్లలోపే 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో షార్జా 13 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించి ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో షార్జా వారియర్జ్ 2 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. 2 పాయింట్లతోనే నెగెటివ్ NRRతో దుబాయ్ క్యాపిటల్స్ ఐదో స్థానానికి పడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




