AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను కెప్టెన్ పీస్ రా భయ్.. రోహిత్‌కు డిప్యూటీగా నేనుండన్న బుమ్రా.. ముంబైని వీడనున్నాడా..?

Jasprit Bumrah MI Vice Captain: ఐపీఎల్ 2027 కోసం ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను జస్ప్రీత్ బుమ్రా తిరస్కరించాడు. రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉండేందుకు నో చెప్పడంతో ముంబైని వీడనున్నాడన్న చర్చ మొదలైంది. 13 ఏళ్లుగా ముంబైతో తన ప్రయాణానికి ముగింపు చెబుతాాడా లేదా అనేది చూడాలి.

నేను కెప్టెన్ పీస్ రా భయ్.. రోహిత్‌కు డిప్యూటీగా నేనుండన్న బుమ్రా.. ముంబైని వీడనున్నాడా..?
Mi Rohit Sharma Vs Bumrah
Venkata Chari
|

Updated on: Nov 28, 2026 | 8:05 AM

Share

Jasprit Bumrah MI News: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2027 సీజన్ కోసం రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా నియమించి సంచలనం సృష్టించింది. రిటెన్షన్ విండోలో హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేయడంతో రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వగా.. అతను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

రోహిత్‌కు డిప్యూటీగా నో చెప్పిన బుమ్రా..

ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా ఉండే ఆఫర్‌ను బుమ్రా వద్దన్నాడు. రోహిత్ శర్మను రెగ్యులర్ కెప్టెన్‌గా ప్రకటించిన వెంటనే ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. అయితే శర్మకు డిప్యూటీగా ఉండేందుకు బుమ్రా ఎందుకు నిరాకరించాడన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్‌.. అదేంటంటే?

ఇవి కూడా చదవండి

గతంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో చాలా మ్యాచ్‌లకు దూరమైనప్పుడు.. బుమ్రాకు స్టాండ్-ఇన్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చారు. అప్పుడు బుమ్రా సరదాగా.. “MI కెప్టెన్ కాకముందే టెస్టు కెప్టెన్ అవుతానని అనుకోలేదు” అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

రూ.18 కోట్లకు రిటెన్.. అయినా వీడుతున్నాడా..?

33 ఏళ్ల బుమ్రాను ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఏకంగా రూ.18 కోట్లకు రిటెన్ చేసుకుంది. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి బుమ్రా ముంబైతోనే ఉన్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ఐదు టైటిళ్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ హిస్టరీలోనే గొప్ప పేసర్లలో ఒకడిగా ఉన్నా.. గత సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.

ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?

ఐపీఎల్ 2026లో 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి 102.50 సగటుతో తన కెరీర్‌లోనే చెత్త సీజన్‌ను నమోదు చేశాడు.

మెగా వేలంలోకి బుమ్రా..?

వైస్ కెప్టెన్సీని తిరస్కరించడంతో బుమ్రా వచ్చే ఏడాది మెగా వేలంలోకి వెళ్లి వేరే టీమ్‌ను ఎంచుకుంటాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2028 సీజన్ కోసం జట్టు మారతాడని ఫ్యాన్స్, నిపుణులు చర్చిస్తున్నారు. అయితే జట్టు మారతానని బుమ్రా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కోరికను వ్యక్తం చేయలేదు.

మరి రోహిత్-బుమ్రా కాంబోలో ముంబై ఐపీఎల్ 2027లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ముంబైని వీడనున్న యార్కర్ కింగ్
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ముంబైని వీడనున్న యార్కర్ కింగ్
బ్యాంకింగ్ కస్టమర్లకు RBI కొత్త రూల్స్.. వచ్చే ఏడాది నుంచి అమలు..
బ్యాంకింగ్ కస్టమర్లకు RBI కొత్త రూల్స్.. వచ్చే ఏడాది నుంచి అమలు..
ఎదిగేపిల్లలు తీసుకోవాల్సిన రాగి పిండి డ్రై ఫ్రూట్స్ లడ్డు..
ఎదిగేపిల్లలు తీసుకోవాల్సిన రాగి పిండి డ్రై ఫ్రూట్స్ లడ్డు..
40 ఏళ్లు దాటిన మహిళలూ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి!
40 ఏళ్లు దాటిన మహిళలూ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి!
సంప్రదాయం మూవీతో ఎంట్రీ.. వేణు మాధవ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే..
సంప్రదాయం మూవీతో ఎంట్రీ.. వేణు మాధవ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే..
రంగారెడ్డి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారా..? కీలక అలర్ట్!
బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారా..? కీలక అలర్ట్!
అతను ఎక్కడ గంభీర్..? ఇక ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు..!
అతను ఎక్కడ గంభీర్..? ఇక ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు..!
ఓటీటీలోకి వచ్చేస్తున్న సమ్మర్ హాలిడేస్..
ఓటీటీలోకి వచ్చేస్తున్న సమ్మర్ హాలిడేస్..
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?